Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Home Tips : ఈ చిట్కా పాటిస్తే.. బియ్యంలో పురుగులు అస్సలు రావు!

Home Tips : ఆహారంలో మనందరం చాలా సార్లు చిన్న చిన్న పురుగులను కనిపెట్టే ఉంటాం. అయితే, ఈ కీటకాలు అనుకోకుండా చాలా సార్లు తిన్నా కూడా మనకు దాదాపుగా ఎటువంటి హాని జరగదు. కానీ, వాటిని రాకుండా చూడాల్సిన బాధ్యత అన్నం కాని ఇతర ఆహార పదార్థాలను కాని అందించే వారిపైన ఉంటుంది. ముందర బియ్యంలో పురుగులు లేకుండా చూడాల్సి ఉంటుంది.

చాలా మంది గృహిణులు అన్నం వండే ముందర పురుగులు ఉన్నాయా? అని చూస్తుంటారు. ఒకవేళ బియ్యంలో పురుగులు ఉంటే వాటిని ఏరి బయట పడేస్తుంటారు. కాగా, ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అయితే కీటకాలు కాని, వాటి లార్వా కాని గుడ్లు కాని బియ్యంలో ఇక అస్సలు ఉండవు.

Home tips to prevent worms, insects from stored rice
Home tips to prevent worms, insects from stored rice

బియ్యం కాని ఇతర ఆహార పదార్థాలు సామగ్రి ఉండే ప్లేస్‌లో వేప ఆకులను కనుక ఉంచినట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయి. వేప ఆకులు ఆ ప్లేసెస్‌లో ఉంచడం వలన కీటకాలకు నిద్ర భంగం కలుగుతుంది. దాంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోతాయి. ఇలా వేప ఆకులు బియ్యంలోకి పురుగులు రాకుండా సాయపడతాయి.

Advertisement

లవంగాలతో కూడా చక్కటి ప్రయోజనాలుంటాయి. బియ్యం కాని ఇతర ఆహార పదార్థాలు, సామగ్రి ఉండే ప్లేసెస్‌లో లవంగాలు ఉంచినట్లయితే అటు వైపునకు కీటకాలు అస్సలు రావు. ఏదేని కీటకాన్ని తొలగించడానికి కూడా లవంగాలు బాగా ఉపయోగపడతాయి.

Home tips to prevent worms, insects from stored rice

మ్యాచ్ బాక్స్ అనగా అగ్గిపెట్టెను కీటకాలు వచ్చే ప్రదేశంలో ఉంచినా కూడా చక్కటి ప్రయోజనాలుంటాయి. అగ్గిపెట్టెను ధాన్యం, బియ్యం వద్ద తెరిచి ఉండటం వల్ల కీటకాలు ఆ ప్లేస్‌కు రావు. ఇందుకు గల కారణం అగ్గిపెట్టెలో సల్ఫర్ ఉండటమే. ఇకపోతే బియ్యంలో పురుగులు ఉంటే కనుక ఎండలో ఆరబోయాలి. అలా చేయడం ద్వారా కీటకాలు కాని పురుగులు కాని అన్నీ బయటకు వెళ్లిపోతాయి. కంటైనర్‌లో స్టోర్ చేసే క్రమంలో బియ్యంతో పాటు అల్లం, వెల్లుల్లి, పసుపు ఉంచితే కీటకాలు బియ్యం వద్దకు రావు.

Read Also : Rice: బియ్యం కొనగానే వండకండి.. ఇలా చేస్తే ఆర్థిక, ఆరోగ్య సమస్యలు దూరం!

Advertisement
Exit mobile version