Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Heel Pain : అమ్మో మడమ నొప్పి.. రావడానికి గల కారణాలు ఇవేనా..?

Heel Pain : నిజజీవితంలో మాట తప్పని మడమ తిప్పని వీరుడై ఉండొచ్చు కానీ, హీల్ పెయిన్ వచ్చిందంటే మాత్రం మీ మాటకు చెల్లుచీటీ ఇవ్వక తప్పదు. కాళ్ళు కాదు వేళ్ళు కాదు ఆ మధ్యలో వచ్చే మడమ నొప్పి మాత్రం ఎవరికీ అవగాహన ఉండదు. దాని కోసం నెలల తరబడి విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఊహించరు. హీల్ పెయిన్ తీవ్ర స్థాయికి వెళ్తే అదే నిజమౌతుంది. సాధారణంగా ప్రతి మనిషిలో పాదం అడుగున ప్లాంటర్ ఫిషియా అనే బలమైన కండరము ఉంటుంది. కాళ్ళ మధ్యన ఉండే గోయ్యి లాంటి నిర్మాణానికి కూడా ఈ కండరమే ఆధారం.

heel-pain-what-are-the-possible-causes

జాగింగ్, పరిగెత్తడం, బరువులు ఎత్తాలంటే ఈ కండరాల సహకారం అవసరం. ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఈ కండరం చీలడం లేదా నలగడం జరుగుతుంది. బరువు లేపుతున్నప్పుడు పాదాన్ని నేలమీదకు బలంగా తొక్కిపెట్టి ఉంచుతాము.ఆ సమయంలో అంతే బలం వ్యతిరేక దిశలో శరీర కండరాలను లోపలికి లాగుతుంది. అంటే పాదం బయటకు,లోపలికి ఒకేసారి ఒత్తిడి కలుగుతుంది. మడమ నొప్పికి ఇదే ప్రధాన కారణం. అయితే పాదాల్లో ఎముకల లోపల పగులు వలన కూడా అరుదుగా నొప్పి కలగవచ్చు. వయసు పెరగడం,అధిక బరువు కారణం కూడా మడమ నొప్పికి కారణం అవ్వచ్చు. అయితే ప్రధాన కారణం ఒత్తిడి మాత్రమే అవుతుంది.

శరీరంలో 26 పెద్ద ఎముకలు ఉంటే వాటిలో ప్రధానమైనది కాలి మడమ ఎముక. దీనికి దాదాపుగా వంద కండరాలు ముప్పై మూడు చిన్నా,పెద్ద ఎముకలు కలిసి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ అనుసంధానం చేసేది మడమ కండరమే. ఒక్కోసారి మడమ భాగంలో చిన్న ఎముకలాంటిది పెరిగి అది మడమ ఎముకకు, కండరానికి మధ్య దూరం పెంచుతుంది. దీని వలన కూడా మడమ నొప్పి రావచ్చు. అయితే ఇది చాలా అరుదు కొద్ధి మందిలో మాత్రమే కనిపిస్తుంది.

Advertisement

మడమ కాలి నొప్పికి గుర్తించలేని అంతర్లక్షణాలు అంటూ ఏమీ ఉండవు. పాదాలపై అధిక ఒత్తిడి పడితే మడమ నొప్పి విపరీతంగా బాధిస్తుంది. మెట్లు, ఎక్కి దిగేటప్పుడు పాదాల మధ్యలో నొప్పి బాగా తెలుస్తుంది. ముఖ్యంగా పాదం వెనుక భాగంలో విపరీతమైన నొప్పి ఉంటుంది. తక్షణ పరిష్కారం కోసం పెయిన్ కిల్లర్స్ వాడాల్సి వస్తే వైద్యుని సూచన మేరకు మాత్రమే వాడాలి.పదేపదే పెయిన్ కిల్లర్స్ తీసుకుంటే దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని గుర్తుంచుకోవాలి.

Read Also : Health Tips : తుమ్మి మొక్క వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Advertisement
Exit mobile version