Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Gaddi Chamanthi : గడ్డిచామంతిలో ఎన్ని ఔషధ గుణాలో తెలుసా? ఆయుర్వేదంలో మొనగాడు మొక్క..!

Gaddi Chamanthi Health Benefits in Ayurveda Medicine

Gaddi Chamanthi Health Benefits in Ayurveda Medicine

Gaddi Chamanthi : గడ్డిచామంతి.. ఇదో కలుపుజాతి మొక్క.. గ్రామాల్లోని చేలగట్లపై ఎక్కువగా కనిపిస్తుంది. ఊరిశివారులో రోడ్లపక్కన కూడా మనం చూస్తూనే ఉంటాం.. చిన్నతనంలో చదువుకునేటప్పుడు ఈ ఆకుతో పలకపై రాసే ఉంటారు. గుర్తొచ్చిందా.. అదేనండీ.. పలకాకు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తుంటారు. కొన్ని చోట్ల గడ్డిచామంతి, పుటపుటాలం, పలక ఆకులు, గాజు తీగ, నల్ల ఆలం, గాయాల ఆకు అనే పేర్లతో పిలుస్తారు. అందరికీ బాగా తెలిసిన పేరు.. గడ్డి చామంతి మొక్క.. ఈ గడ్డి చేమంతి మొక్కలో అనేక ఔషధ గుణాలున్నాయి.

Gaddi Chamanthi Health Benefits in Ayurveda Medicine

ఈ మొక్క సన్నపాటి ఆకులతో పసుపు పచ్చని పూలతో కనిపిస్తుంది. ఈ మొక్కలో అనేక ఆయుర్వేద గుణాలున్నాయి. అనేక అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ మొక్క దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు గడ్డి చామంతిని ఉపయోగిస్తారు. దెబ్బ తగిలిన చోట లేదా గాయానికి గడ్డి చామంతి ఆకుల రసాన్ని పూస్తే.. మంచి యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది. గడ్దిచామంతి అనేక రకాల చర్మ వ్యాధులకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ఆకుల రసం ఇప్పటికీ మన దేశంలో అనేక ప్రదేశాల్లో వాడుతూనే ఉన్నారు. ఈ మొక్క ఎగ్జిమా నివారణలో అద్భుతంగా పనిచేస్తుందని పలు పరిశోధనల్లో తేలింది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఈ మొక్కలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. చర్మ అంటు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నవారికి ఈ ఆకు రసం మంచి ఔషధంగా చెప్పవచ్చు. మనదేశంలో అనేక గ్రామాల్లో తామర, గజ్జి, బొబ్బలు, గాయాలకు ఈ గడ్డి చామంతితో చికిత్స అందిస్తారు. గడ్డి చామంతిలోని ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నడుము నొప్పి, వెన్ను నొప్పి సమస్యలను వెంటనే తగ్గిస్తుంది. ఈ మొక్కను కాలేయ రుగ్మతలు, పొట్టలో పుండ్లు, గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద వైద్యంలో వాడుతారు.

Advertisement

షుగర్ వ్యాధికి ఈ గడ్డి చామంతి మొక్క చాలా బాగా పనిచేస్తుందని పరిశోధనలో తేలింది. గడ్డిచామంతి ఆకులలో జేర్యలోనిక్ అనే రసాయనం ఉంటుంది. ఇది షుగర్ వ్యాధికి చాలా బాగా పనిచేస్తుంది. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడంలో ఈ రసాయనం బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. గడ్డి చామంతి ఆకుల నుంచి రసాన్ని తీసి తెల్లని వెంట్రుకలన్న చోట రాస్తే తొందరగా నల్లగా మారిపోతాయి. రాలిన జుట్టు పెరుగుదలకు గడ్డి చామంతి మంచి మెడిసిన్ కూడా..

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఇంకా చెప్పాలంటే.. గడ్డిచామంతి మొక్క ఆకుల రసాన్ని తేలుకుట్టినచోట రాస్తే.. నొప్పి నుంచి వెంటనే ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు.. ఈ ఆకుల రసం తేలు విషానికి మంచి విరుగుడగా పనిచేస్తుంది. వర్షాకాలం వచ్చిదంటే.. దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎండిన ఈ గడ్డిచామంతి మొక్క ఆకులతో ఇంట్లో పొగ వేస్తే క్రిమి కీటకాలు, దోమలు, ఈగలు ఇంట్లోకి రావు.

Read Also : Papaya Benefits : బొప్పాయిలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవి తప్పక తెలుసుకోండి..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version