Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Eluka Jemudu Plant : ఎలుక జెముడు మొక్క గురించి విన్నారా..!? ఈ మొక్కతో ప్రపంచాన్ని వణికించే ఈ వ్యాధికి చెక్..!!

Eluka Jemudu Plant: Eluka chevi Plant Health Benefits

Eluka Jemudu Plant: Eluka chevi Plant Health Benefits

Eluka Jemudu Plant : బ్ర‌హ్మ‌జెముడు మొక్క గురించి విన్నాం కానీ ఈ ఎలుక జెముడు మొక్క గురించి ఎప్పుడూ విన‌లేదు అని అనుకుంటున్నారు క‌దూ. అవును ఈ మొక్క గురించి పెద్ద‌గా ఎవ‌రికీ తెలియ‌దు. తెలిస్తే దానిని అస్స‌లు వ‌దిలిపెట్ట‌రు. ఎందుకంటే ఈ మొక్క మ‌న‌కు త‌ర‌చూ కనిపిస్తుంది కానీ అదే ఎలుక జెముడు మొక్క అని మన‌కు తెలియ‌దు.

ఏదో పిచ్చి మొక్క లేదా గ‌డ్డి తీగ అనుకుంటాం కానీ దానిలో ఉండే ఔష‌ద విలువ‌లు తెలిస్తే దానిని చూసే కోణ‌మే మారిపోతుంది. అంత‌లా అద్భుత‌మైన ఔష‌ద ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న ఈ మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఈ ఎలుక‌జెముడు మొక్క‌కు చాలా విశిష్ట‌త ఉంది. గ్రామాల్లో ఎలుక చెవి మొక్క‌గా దీనిని పిలుస్తారు. చెరువు గ‌ట్ల‌పైన‌, వాగుల అంచున ఇవి క‌నిపిస్తాయి. ఆయుర్వేద మందుల్లో ఈ మొక్క‌ను విరివిగా వాడుతుంటారు.

నులి పురుగుల స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి ఈ మొక్కతో త‌యారు చేసిన ఔష‌దం చాలా చ‌క్క‌గా ప‌ని చేస్తుంది. ఈ ఆకు ర‌సాన్ని, సైంద‌వ ల‌వ‌ణాన్ని బియ్యం పిండితో క‌లపాలి. విండ‌గాల‌తో రొట్టెలు త‌యారు చేసుకోవాలి. ఆ రొట్టెల‌ను బొగ్గుల‌పై కాల్చుకొని తినాలి. ఇలా చేస్తే నులిపురుగుల స‌మ‌స్య పోతుంది. అలాగే క‌డుపునొప్పి కూడా త‌గ్గుతుంది. కంటి సంబంధిత వ్యాధుల‌తో బాధ‌ప‌డేవారు ఈ ఆకును కూర వండుకొని తింటే ఆ స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

Advertisement

ఎలుక కొరికిన‌ప్పుడు ఈ మొక్క ఆకుల‌ను ర‌సంలా చేసి ఒక చెంచా తాగాలి. ఆ ఆకుల పేస్ట్‌ను గాయం అయిన చోట రుద్దాలి. శ‌రీరంలో వేడి త‌గ్గించ‌డానికి, గ‌ర్భం నిల‌వ‌డానికి, కిడ్నీలో రాళ్ల‌ను తొల‌గించ‌డానికి, మైగ్రేన్స్‌ను త‌గ్గించ‌డానికి, రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డానికి, కాన్స‌ర్‌కు క‌ణాల‌కు వ్య‌తిరేకంగా పోర‌డటానికి ఈ మొక్క దివ్య ఔష‌దంలా ప‌ని చేస్తుంది.
Read Also Kanuga Health Benefits : కానుగ చెట్టు ఆరోగ్యానికి అందించే కానుకలు ఇవే..!!

Exit mobile version