Thyroid: ప్రస్తుత కాలంలో ప్రతి పది మందిలో ఒకరు బాధపడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య ఒకటి. థైరాయిడ్ గ్రంథులు ప్రతి ఒక్కరికి మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఈ థైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. అయితే ఈ గ్రంథుల నుంచి మన శరీరంలో ప్రతి కణానికి ప్రతి శరీర భాగానికి అవసరమయ్యే హార్మోన్లు విడుదల అవుతూ ఉంటాయి.అయితే ఈ గ్రంధి నుంచి ఎక్కువ మొత్తంలో లేదా తక్కువ మొత్తంలో హార్మోన్లు విడుదలైన అది మన ఆరోగ్యానికి ప్రమాదకరమనీ చెప్పాలి.అయితే థైరాయిడ్ సమస్య ఎక్కువగా మగవారిలో కన్నా ఆడవారిలో ఎక్కువగా ఉంటుందని ఈ సమస్య మగవారిలో ఉండదని చాలా మంది అపోహపడుతుంటారు.
ఇక హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారు శరీర బరువు అమాంతం తగ్గిపోతారు.అలాగే మెడ చుట్టూ వాపు ఉంటుంది. హైపోథైరాయిడ్ సోకినప్పుడు శరీర బరువు తగ్గి పోవడమే కాకుండా శరీరంలోని వివిధ భాగాలు తొందరగా అలసిపోయి నీరసించిపోతాయి. తొందరగా చెమటలు పట్టడం, చర్మం పొడిబారడం, కాళ్లు చేతులు వాపులు రావడం, మానసిక ఎదుగుదల లేకపోవడం వంటి లక్షణాలు మగవారు ఆడవారు ఇద్దరిలోనూ కనపడతాయి. ఇకపోతే ఆడవారు ఈ సమస్యతో బాధపడేటప్పుడు నెలసరి సక్రమంగా రాదు. అదేవిధంగా గర్భధారణ సమయంలో కూడా సమస్యలు తలెత్తుతాయి.అందుకే సరైన ఆహారం తీసుకుంటూ శారీరక వ్యాయామాలు చేయడం వల్ల ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
