Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Autism: మీ పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారా…తల్లి తండ్రులు జాగ్రత్త!

Autism: ప్రతి ఒక్క తల్లిదండ్రుల పిల్లల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంటుంది.ఈ క్రమంలోనే పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం మన పనుల్లో పడి పిల్లల ప్రవర్తన గమనించకపోతే ఎంతో నష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.మన పిల్లలు ఇతర పిల్లలతో పాటు సమానంగా ప్రవర్తిస్తున్నారా లేదా మన పిల్లలు ఏదైనా మార్పులు ఉన్నాయా అనే విషయాల గురించి తెలుసుకోవాలి.

ముఖ్యంగా చాలా మంది పిల్లలు ఎంతో హుషారుగా అన్ని ఎంతో చురుకుగా పాల్గొంటారు. మరి కొందరు అదే వయసు ఉన్నప్పటికీ అందరితో కలివిడిగా తిరగలేరు. అలాగే మఆటపాటలలో నం ఏదైనా పిలుస్తున్న ఇప్పటికీ మనకు స్పందించకపోవడం, మన గొంతు గుర్తించక పోవడం వంటి లక్షణాలతో బాధపడుతూ ఉంటారు.ఈ విధమైనటువంటి లక్షణాలతో బాధపడే పిల్లలు ఆటిజం అనే వ్యాధితో బాధపడుతున్నట్లు అని అర్థం.

ఈ విధమైనటువంటి ఆటిజం వ్యాధితో బాధపడే పిల్లలు ఇతర పిల్లల మాదిరిగా చురుకుగా అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇలాంటి పిల్లలు ఏ విషయానికి స్పందించకుండా ఎంతో భిన్నంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు కనుక మీ పిల్లలలో కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఎంతో ఉత్తమం. అయితే ఈ వ్యాధికి సరైన చికిత్స ఉందని చెప్పలేక పోయినప్పటికీ వ్యాధి తీవ్రత, లక్షణాలను తగ్గించవచ్చు. అందుకే పిల్లలు దగ్గర తల్లిదండ్రులు ఎక్కువ సమయం పాటు గడుపుతూ వారిని తరుచు మాట్లాడిస్తూ… వారిని యాక్టివ్ గా ఉంచడానికి ప్రయత్నించాలి.

Advertisement
Exit mobile version