Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Amla juice : పరగడుపున ఈ రసం తాగారంటే చాలు.. అన్ని సమస్యలకు చెక్ పెట్టొచ్చు!

Amla juice : ఉసిరికాయ.. ఈ పేరు వినగానే చాలా మందికి నోట్లో నీళ్లురుతాయి. పుల్లగా ఉండే ఈ ఉసిరికాయలో అనేకమైన ఖనిజాలు, విటామిన్లు పుష్కలంగా ఉంటాయి. విటామిన్ సి అత్యధికంగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచడంలో సాయపడుతుంది. జలుబు, దగ్గును సులువుగా తగ్గిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఇన్ని లాభాలను కల్గించే ఈ ఉసిరి కాయ రసాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడపున తాగితే మరిన్ని లాభాలుంటాయని ఆరోగ్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Amla juice

పరగడుపున ఉసిరి రసం తాగడం వల్ల బరువు తగ్గుతారు. ఇది శరీర ఆకృతిని మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో అనేక యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. కొవ్వును కరిగించడంలో ఉసిరి కాయ పాత్ర చాలా ఉంటుంది. ఇందులో ఉండే కెరోటిన్ కంటి చూపుకు మేలు చేస్తుంది. అలాగే మూత్ర పిండాల్లో రాళ్లను తొలగిస్తుంది. ఉసిరి రసం యూరినరీ ఇన్ఫెక్షన్ లను తగ్గిస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం మీరు కూడా ఉసిరి రసాన్ని తాగండి. ఆరోగ్యంగా ఉండండి.
Read Also : Amla seeds : ఉసిరికాయ తిన్న తర్వాత గింజలను పడేస్తున్నారా.. ఈ లాభాలు తెలుసుకుంటే ఇంకోసారి అలా చేయరు

Advertisement
Exit mobile version