Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashmika: లక్ష్యాన్ని చేరుకోవాలంటే స్థిరంగా ప్రయత్నాలు చేయాలి.. శ్రీవల్లి షాకింగ్ కామెంట్స్!

Rashmika: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న రష్మిక మందన్న తన అందం అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల రష్మిక నటించిన పుష్ప సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. శర్వానంద్ తో కలిసి ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలో కూడా నటించింది . చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఫిట్ నెస్ విషయంలో కూడా చాలా జాగ్రత్త వహిస్తుంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్న ఫిట్నెస్ విషయంలో అసలు నిర్లక్ష్యం చేయని రష్మిక జిమ్ వర్కవుట్ కి సంబంధించిన వీడియోలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ ద్వారా మంచి ఫిట్నెస్ సాధించడానికి ఏం చేయాలి అన్న విషయాల గురించి అభిమానులతో పంచుకుంది. ఈ తరుణంలో రష్మిక పోస్ట్ చేస్తూ.. ఫిట్నెస్ కోసం కేవలం జిమ్ కి వెళ్లి వ్యాయామాలు చేస్తే సరిపోదు.. ఆహార విషయంలో కూడా చాలా శ్రద్ధ చూపాలని అభిమానులకు సూచించింది.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

ఫిట్నెస్ కోసం ఆరోగ్యకరమైన ఆలోచనలను అలవాటు చేసుకుంటే శారీరకంగా కూడా మార్పు కనిపిస్తోందని ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ తెలియజేశారు. వర్కౌట్ మొదలు పెట్టిన సమయంలో మొదట ఆహార నియంత్రణ, వర్కౌట్స్ చాలా కష్టంగా అనిపిస్తాయి. కానీ ఒక్కసారి అలవాటైతే అద్భుతాలను చూడొచ్చు.ఈ లక్ష్యాన్ని సాధించాలంటే ఆలోచనలు స్థిరంగా ఉండాలని ఈ సందర్భంగా అభిమానులకు సూచించింది.

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version