Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vijay Deverakonda : వివాదంలో విజయ్ దేవరకొండ.. పొగరు అన్నవాళ్లకు దిమ్మతిరిగే రిప్లయ్.. ఆ ప్రెస్‌మీట్‌లో అసలేం జరిగిందంటే?

Vijay Deverakonda : లైగర్ బాయ్ విజయ్ దేవరకొండ వివాదంలో చిక్కుకున్నాడు. లైగర్ మూవీ రిలీజ్ దగ్గరపడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ వేగాన్ని పెంచేశాడు. వరుస ప్రెస్‌మీట్లతో విజయ్ దేవరకొండ (Vijaya Deverakonda) బిజీగా గడిపేస్తున్నాడు. దక్షిణాది నుంచి మొదలుకుని ఉత్తరాదిలోనూ ప్రెస్ మీట్లలో పాల్గొంటున్నాడు. అందులో భాగంగానే హైదరాబాద్‌లో లైగర్ మూవీకి సంబంధించి ప్రెస్‌మీట్‌ జరిగింది. ఈ సందర్భంగా విజయ్‌ ప్రవర్తనను తప్పుబడుతూ విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వివాదంపై విజయ్‌ స్పందించాడు. మనం జీవితంలో ఎదుగుతున్న సమయంలోనే ఇలాంటివన్నీ వస్తుంటాయని అన్నాడు.

Vijay Deverakonda Shocking Reply to Media Trollers on his Behaviour During Press Meet of Liger Movie

దీనికి సంబంధించిన వీడియోను విజయ్‌ షేర్‌ చేస్తూ.. సినిమా రంగంలో ఎదిగేందుకు ఆసక్తి ఉన్నవారందరూ ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో మనకు తెలియకుండానే ఎందరికో టార్గెట్‌ అవుతుంటారు. గిట్టనవారి నుంచి వ్యతిరేక ప్రచారాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. అలాంటివి ఎదురైనప్పుడు మనం పోరాటం చేయాలి. అందరిలానే నేను కూడా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. నీకు నువ్వు నిజాయతీగా ఉన్నంతసేపు.. అందరి ప్రేమ, దేవుడి దయ వెన్నుండి ఉండి అనుక్షణం రక్షిస్తూనే ఉంటాయని విజయ్ చెప్పుకొచ్చాడు. తనపై వస్తున్న తప్పుడు వార్తలపై విజయ్ స్పందించడంతో నెగెటివ్‌ ప్రచారానికి బ్రేక్ పడినట్టు అయింది.

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ.. అంతపని చేశాడా? అందుకే భారీగా ట్రోల్స్ చేశారా?

ఆ ప్రెస్‌మీట్లో అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ ప్రెస్‌మీట్‌లో కొందరు తెలుగు జర్నలిస్టులతో హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య చిట్ చాట్ జరిగింది. ఈ సందర్భంగా లైగర్ మూవీకి సంబంధించి విషయాలను ప్రస్తావించారు. ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతున్న సమయంలో విజయ్‌ టేబుల్‌పై ఇలా తన రెండు కాళ్లు పెట్టాడు. అంతే.. ఆ వీడియోను చూసిన కొంతమంది విజయ్ దేవరకొండపై భారీగా ట్రోల్స్ చేశారు. పాన్‌ ఇండియా హీరో అయ్యే సరికి విజయ్‌కు పొగరు పెరిగిందని అనేక మీడియా వెబ్‌సైట్స్‌, సోషల్‌మీడియాల్లో వార్తలు వైరల్ అయ్యాయి.

Advertisement
Vijay Deverakonda Shocking Reply to Media Trollers on his Behaviour During Press Meet of Liger Movie

దీనిపై ఆ ప్రెస్‌మీట్లో ఉన్న ఒక విలేకరి స్పందించాడు. అసలు ఆరోజు ఏం జరిగిందో వివరించాడు. విజయ్‌ దేవరకొండను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆయన మాతో ఎంతో సరదాగా ఉంటారని తెలిపారు. మూవీ జర్నలిస్టు ఒకరు విజయ్‌ నటించిన ‘టాక్సీవాలా’ రోజుల్ని గుర్తు చేశారు. ఆ రోజుల్లో మీతో చాలా సరదాగా మాట్లాడాం.. ఇప్పుడు మీరు పాన్‌ ఇండియా స్థాయిలో మూవీ చేస్తున్నారు.

మీతో ఫ్రెండ్లీగా మాట్లాడాలంటే కొంచెం బెరుకుగా ఉందన్నారు. అప్పుడు విజయ్ ఆ విలేకరిలోని భయాన్ని పొగొట్టేందుకు మీరు అవన్నీ పట్టించుకోవద్దన్నాడు. మనమంతా సరదాగా మాట్లాడుకుందామన్నాడు. మీరు కాలు మీద కాలేసుకుని కూర్చొండని, తానూ కాలు మీద కాలేసుకుని కూర్చొంటానని ఫ్రెండ్లీగా అనేశారు. విజయ్‌ అలా అనడంతో అక్కడివారంతా నవ్వుకున్నారని అసలు విషయాన్ని వెల్లడించాడు.

Read Also : Sri Reddy: పిల్లల పెంపకం గురించి శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్… మీరైనా బాగుపడండి అంటూ హితబోధ!

Advertisement
Exit mobile version