Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Vijay Devarakonda : విజయ్ దేవరకొండకు ఏమైంది.. లైగర్ బాయ్‌కు అందుకే నడుం పట్టేసిందా? అసలు మ్యాటర్ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Vijay Devarakonda : ఇప్పుడు ఎక్కడ చూసిన లైగర్ బాయ్ రచ్చ చేస్తున్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు విజయ్ దేవరకొండ దూసుకెళ్లిపోతున్నాడు. పాన్ ఇండియా మూవీగా వస్తున్న లైగర్ మూవీ కోసం సినిమాలో నటించడానికి మించి తెగ కష్టపడుతున్నాడు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా లైగర్ మూవీని తెగ ప్రమోషన్ చేసేస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ మూవీని తన భుజాలపై వేసుకుని మరి ప్రమోషన్స్ చేసేస్తున్నాడు దేవరకొండ. ఈ మూవీలో విజయ్ సరసన అనన్య పాండే నటించింది. వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో తిరుగుతూ లైగర్ మూవీకి ఫుల్ ప్రమోషన్ తీసుకొస్తున్నారు.

Vijay Devarakonda Suffering from Back Pain, Although He will not stop Liger Movie Promotion Works

అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇతర హీరోలకు లేని ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. చేసింది కొన్ని సినిమాలైనా ఏ హీరోకి దక్కని క్రేజ్ అతడి సొంతం.. అదే జోరుతో లైగర్ బాయ్ దూసుకెళ్తున్నాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో రానున్న లైగర్ మూవీ కోసం విజయ్ దేవరకొండ బాగానే కష్టపడ్డాడు. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొనడంతో ప్రమోషన్స్ వేగాన్ని మరింత పెంచేశారు. ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో లైగర్ మూవీ రిలీజ్ కానుంది. అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన లైగర్ మూవీ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలో రిలీజ్ కానుంది.

Rohini Bazaar Deoghar : ఇదో పురాతన షాపింగ్ మాల్.. ఇక్కడ బట్టల ధర రూ. 30, కూరగాయల సంచి రూ. 100.. అన్నీ చౌకగానే..!

Vijay Devarakonda : నడుం నొప్పి బాధిస్తున్నా.. తగ్గేదేలే అంటున్న  విజయ్ దేవరకొండ..

Vijay Devarakonda Suffering from Back Pain 

ఈ సినిమా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కింది. చిత్ర యూనిట్ అంతా ఈ మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ తీవ్రమైన నడుం నొప్పితో బాధపడుతున్నాడు. పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉందనే చెప్పాలి. అంతగా నడుం నొప్పి వేధిస్తున్న విజయ్ దేవరకొండ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా ప్రమోషన్స్ లో పాల్గొంటునే ఉన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎయిర్‌పోర్ట్ చెక్ ఇన్ దగ్గర విజయ్ దేవరకొండ నిలబడిన వీడియోలో కనిపిస్తుంది. ఒకవైపు తీవ్రమైన నడుం నొప్పి బాధిస్తున్నా ఎంతమాత్రం లెక్కచేయకుండా నొప్పిని భరిస్తూ అలానే నిలబడిపోయాడు లైగర్ బాయ్.

Advertisement

అదే పనిగా ప్రమోషన్స్ కోసం జెర్నీలు చేయడంతో విజయ్ దేవరకొండకు నడుం పట్టేసింది. మొదట్లో అది స్వల్పంగా వెన్నునొప్పిగా అనిపించినా.. రానురానూ తీవ్రంగా మారింది. కనీసం రెస్టు కూడా తీసుకోకుండా లైగర్ మూవీ కోసం తెగ కష్టపడుతున్నాడు. సినిమా రిలీజ్ కూడా దగ్గరలోనే ఉంది. నిద్రలేకుండా మూవీ రిలీజ్ ఏర్పాట్లలో బిజీగా గడిపేస్తున్నాడు. అమ్మనాన్న తమిళ అమ్మాయి మూవీ మాదిరిగా ఉన్న మూవీ ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఇంతగా ప్రమోషన్స్ చేస్తున్న లైగర్ మూవీ ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

IND vs SA 1st T20I : హార్దిక్ పాండ్యా సిక్సర్లతో సెంచరీ.. కేఎల్ రాహుల్ రికార్డు బ్రేక్.. టాప్ 5లో ఎవరంటే?

Read Also : Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version