Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashmika Mandanna : రాజకీయాల్లోకి రష్మిక.. ఎంపీ కావడం ఖాయమంటున్న వేణు స్వామి!

Rashmika Mandanna : ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి.. గీతా గోవిందం సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ. అయితే ఈమె త్వరలోనే రాజకీయాల్లో రాబోతుందని.. ఎంపీ కూడా కాబోతుందంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్లు చేశారు. అసలు ఆ విషయం ఏంటి, రష్మిక పొలిటికల్ ఎంట్రీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

venu-swamy-shocking-comments-on-heroin-rashmika-political-entry

సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై వేణు స్వామి చేసే కామెంట్లు తెగ వైరల్ అవుతుంటాయి. ఈయనకు పరిశ్రమలో కొంత క్రెడిబిలిటీ కూడా ఉంది. చాలా మంది ఆయన చెప్పే మాటలు నమ్ముతారు. ప్రత్యేక పూజలు కూడా చేయించుకుంటారు. ఆయితే ఆయన తాజా రష్మిక మందన్న గురించి పలు కామెంట్లు చేశాడు. ఆమె ఇంట్లో నేను ప్రత్యేక పూజలు చేశాను.. దాని వల్ల ఆమె దశ తిరిగందన్నాడు. అలాగే ఆమె ప్రస్తుతం నేషనల్ క్రష్ గా మారిందని.. ఒక్క సినిమాకు 6 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటుందంటూ వివరించాడు.

ఆమె జాతకరీత్యా ఉన్నత స్థాయికి వెళ్తుందని వేణు స్వామి రష్మిక గురించి చెప్పాడు. త్వరలోనే ఆమె రాజకీయాల్లోకి రాబోతుందని అన్నాడు. అయితే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ఎంపీ కూడా అవుతుందని బల్లగుద్ది మరీ చెప్పాడు. లోక్ సభలో అడుగు పెట్టే యోగం ఆమె జాతకంలో ఉందంటూ వివరించాడు. అయితే వేణు స్వామి చేసిన ఈ కామెంట్లు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి.

Advertisement

Read Also : Anchor Rashmi : ఏంటి.. యాంకర్ రష్మీ నవ్వుల వెనుక ఇన్ని కష్టాలా.. స్టేజ్‌పైనే బోరుమని ఏడ్చేసింది..!

Exit mobile version