Big Boss Non Stop Telugu: బుల్లితెరపై ప్రసారం అవుతూ ఎంతో మంచి ఆదరణ తగ్గించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఓటీటీలో ప్రసారం అవుతూ మరింత ఆదరణ పొందుతోంది. 17 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్ లో ఎలిమినేట్ అయ్యారు.నేటితో మరొక వారం పూర్తి కావడంతో ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం గురించి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మొదటి వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్ లేదా మూడవ వారం ఎలిమినేట్ అయిన చైతూ తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరూ బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లడంతో వీరి అభిమానులు తీవ్ర స్థాయిలో బిగ్ బాస్ నిర్వాహకులపై మండిపడిన సంగతి మనకు తెలిసిందే ఈ క్రమంలోనే వీరిద్దరిలో ఎవరో ఒకరిని ఈవారం హౌస్ లోకి పంపించినట్లు సమాచారం.