Vishwaksen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో ద్వారా హీరో వివాదాలను ఎదుర్కొన్నాడు. ఇలాంటి ఫ్రాంక్ వీడియోలను చేయడం వల్ల పబ్లిక్ న్యూసెన్స్ అవుతుందని ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టి మరి విశ్వక్ సేన్ పట్ల అమర్యాదగా ప్రవర్తించడంతో టీవీ యాంకర్, హీరో మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. దీంతో సోషల్ మీడియా వేదికగా రెండు గ్రూపులుగా విడిపోయి కొందరు దేవి నాగవల్లికి మద్దతు తెలపగా మరికొందరు హీరోకి మద్దతు తెలుపుతున్నారు.
ఇక రీసెంట్ గా డీజే తిల్లు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సిద్ది జొన్న గడ్డల ఈ సినిమా పై స్పందిస్తూ…అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మనసుపెట్టి చేశారు. ఈ సినిమా చూస్తున్నంత సేపు నా మొహంలో చిరునవ్వు ఉంది నిజాయితీగల రైటింగ్, పర్ఫామెన్స్ లలో స్వచ్ఛత ఉంది. సినిమా ఎంతో క్యూట్ గా ఉందని సిద్ధు జొన్నలగడ్డ అశోకవనంలో అర్జున కళ్యాణ్ గురించి రివ్యూ ఇచ్చారు.