Raashi Khanna: మాతృదినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరు వారి మాతృ మూర్తులకు ఖరీదైన బహుమతులను అందజేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది వారి తల్లులతో కలసి వారికున్న తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి రాశి ఖన్నా మదర్స్ డే సందర్భంగా తన తల్లికి ఖరీదైన బహుమతి ఇచ్చారు. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లకు ఎంతో బిజీగా ఉన్న రాశి ఖన్నా మదర్స్ డే సందర్భంగా ఆదివారం తన తల్లికి ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది.
అలాగే నాగచైతన్య సరసన థ్యాంక్యూ అనే చిత్రంలో నటించారు.ఈ సినిమా కూడా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. వీటితో పాటు హిందీలో యోధ అనే సినిమాలో నటిస్తోంది. సిద్దార్థ్ మల్హోత్రా, దిశా పటానీ ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫర్జీ అనే హిందీ వెబ్ సిరీస్ లో బిజీగా ఉన్నారు. అలాగే తమిళంలో ఏకంగా నాలుగు సినిమాలకు సంతకం చేసి కెరీర్లో ఎంతో బిజీగా ఉన్నారు.