Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్‌.. సామ్‌ షాకింగ్ రిప్లయ్..!

Samantha Ruth Prabhu Strong Reply to troller 'She will end up dying alone with cats and dogs

Samantha Ruth Prabhu Strong Reply to troller 'She will end up dying alone with cats and dogs'

Samantha Ruth Prabhu : ప్రస్తుత సమాజంలో ఒంటరి మహిళలు ఇంటా బయటా అవమానాలు తప్పడం లేదు. అదే సెలబ్రెటీలు అయితే వారిపై ఇంకా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తుంటారు. ఒకవైపు లైఫ్ లీడ్ చేస్తూనే మరోవైపు ఇలాంటి అవమానాలను భరిస్తూ ధైర్యంతో ముందుకు సాగుతుంటారు. తనకు ఎన్ని అవమనాలు ఎదురైనా.. ఎన్ని సూటిపోటి మాటలతో ఇబ్బందిపెట్టినా కొంచెం కూడా భయపడకుండా ముందుకు సాగుతోంది సమంత.. విడాకుల అనంతరం సమంతపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. నెటిజన్లు ఏదో ఒక విషయంలో సమంతపై ట్రోల్ చేస్తునే ఉన్నారు.

అయినా తనపై ట్రోల్స్ చేసేవారికి తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే ఉంది. తన జీవితం గురించి బాధపడుతూ కూర్చొనేకంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న తపనతో ముందుకు సాగుతోంది సామ్.. ఒకవైపు స్టార్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటోంది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో తన విషయాలను షేర్ చేసుకుంటోంది సామ్.

Samantha Ruth Prabhu Strong Reply to troller ‘She will end up dying alone with cats and dogs’
లేటెస్టుగా సమంత ఒక ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఆ ఫొటోను చూసిన నెటిజన్ సమంతపై షాకింగ్ కామెంట్ చేశాడు. ఆ ఫొటోలో సమంత తన పెట్స్ కుక్కలు, పిల్లులతో కలిసి నవ్వుతూ కనిపించింది. దానికి ఆ నెటిజన్.. సమంత.. పెట్స్ కుక్కలు, పిల్లులతో ఒంటరిగానే చనిపోవాలి అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ చూసిన వెంటనే సామ్ గట్టిగానే రిప్లయ్ ఇచ్చింది.. ‘అవునా.. అదే జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఉండరు..’ అంటూ దిమ్మతిరిగేలా రిప్లయ్ ఇచ్చింది సామ్..
Samantha Ruth Prabhu Strong Reply to troller ‘She will end up dying alone with cats and dogs’

సమంత స్ట్రాంగ్ రిప్లయ్ చేసిన ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్లు కూడా అలాంటి విమర్శలు చేసిన నెటిజన్ పై మండిపడుతున్నారు. సామ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆ నెటిజన్ వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. అయినా ఆ ట్వీట్ స్క్రీన్ షాట్ తీసిన కొందరు నెటిజన్లు రీట్వీట్ చేస్తున్నారు. ఆ నెటిజన్ సమంతపై వ్యంగ్యంగా కామెంట్ చేసినప్పటికీ సామ్.. కూల్ గానే పాజిటివ్ రిప్లయ్ ఇచ్చిందని నెటిజన్లంతా సమంతను అభినందిస్తున్నారు. ఎంతమంది తనను అవమాన పరిచినా నవ్వుతూనే వారికి తగ్గ సమాధానం చెప్పిందని సామ్ ను పొగడ్తలతో ముంచెత్తున్నారు. సామ్.. ఖుషి, యశోద మూవీల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Read Also : Samantha: సమంతను వాళ్లు నిజంగానే అంత ఘోరంగా అవమానించారా..?

Exit mobile version