Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

RRR World Record : వరల్డ్‌లో టాప్-3గా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్…!

RRR World Record

RRR World Record

RRR World Record : దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తుంది. కోట్ల రూపాయలను కొల్లగొడుతూ… అనేక రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ ను సాధించి.. టాప్ గ్రాసర్ లిస్టులో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా ఆర్ఆర్ఆఱ్ కన్నా ముందు దంగల్, బాహుబలి 2 మాత్రమే ఉన్నాయి. 2016లో విడుదలైన ‘దంగల్​’ రూ.2,024 కోట్లను వసూలు చేయగా.. 2017లో రిలీజ్​ అయిన బాహుబలి కంక్లూజన్​ రూ.1,810 కోట్లు అందుకుంది.

అలాగే అమెరికాలో ఓవర్సీస్​ బాక్సాఫీస్​పై ఆర్ఆర్ఆర్ దండయాత్ర చేస్తోంది. ఇప్పటికే యూఎస్​ఏ మార్కెట్​లో 13.3 మిలియన్​ డాలర్లు కలెక్ట్​ చేసింది. భారత కరెన్సీ ప్రకారం రూ.100కోట్లుకు పైగానే. అంతకముందు ‘బాహుబలి 2’ అక్కడ ఇదే స్థాయిలో వసూళ్లను అందుకుంది. 113.79కోట్లు సాధించినట్లు ట్రేడ్​ వర్గాల సమాచారం. ఈ లెక్కల ప్రకారం ‘ఆర్​ఆర్​ఆర్’ హవా ఇంకా కొనసాగితే ‘దంగల్​’ కలెక్షన్లను దాటలేక పోయినప్పటికీ..​ ‘బాహుబలి’ని మించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read Also : RRR World record: వరల్డ్ లో టాప్-3 గా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డ్…!

Advertisement
Exit mobile version