Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Rashmika Mandana : ఆ హీరోతో రష్మిక బ్రేకప్‌ అందుకే చెప్పిందా? ఆమె జాతకంలో ఏముంది? వేణు స్వామి చెప్పిందే నిజమైందా?

Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty

Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty

Rashmika Mandana : రష్మిక మందన గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చలో సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస విజయాలు అందుకుంటూ నేషనల్ క్రష్ గా మారింది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ వంటి చిత్రాల్లో నటించి కొద్దికాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమా తో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది. అంతేకాకుండా అల్లు అర్జున్ సరసన పుష్ప మూవీలో నటించింది ఈ కన్నడ బ్యూటీ. రష్మిక మందన బ్రేకప్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty

ఈ మధ్యకాలంలో ప్రముఖ సిద్ధాంతి వేణు స్వామి పేరు తెగ వినిపిస్తుంది. ఇతను ఉదయం పూట వచ్చే భక్తి ప్రోగ్రాం లో కనిపించేవారు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ నటుల జాతకాల గురించి వివరిస్తూ ఈమధ్య బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ వేణు స్వామి ప్రముఖ కన్నడ హీరోయిన్ రష్మిక మందన జాతకం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టాడు. రష్మిక మందన కన్నడ ప్రముఖ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం ఖాయం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.

Rashmika Mandana : రష్మిక-రక్షిత్ పెళ్లి జరగదన్న జ్యోతిషుడు వేణు స్వామి..

Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty

అయితే వేణు స్వామి ఆ సమయంలో వారిద్దరు జాతకం చూశానని వీరిద్దరి పెళ్లి జరగదు అని తనకు తెలిసిపోయిందని తెలిపారు. ఇక ఈ విషయం రష్మిక కుటుంబ సభ్యులకు కూడా తెలియ చేశానని చెప్పాడు. వీరిద్దరూ ఎందుకు కలిసి ఉండలేదు అని విషయం గురించి స్పందిస్తూ వారి ఇద్దరి జాతకాలు కలవలేదని అలాగే వాళ్ల లైఫ్ స్టైల్ కూడా భిన్నంగా ఉండటంతో వారిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేరు అని చెప్పాడు. దాంతో రష్మిక మందన కూడా తనకు జరిగిన ఎంగేజ్మెంట్ నీ బ్రేకప్ చేసిందని చెప్పాడు.

Advertisement
Rashmika Mandana Talking About His Broken Engagement With Rakshit Shetty

రష్మిక ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందిస్తున్నారు. కిరాక్ పార్టీ సినిమాలో నటించేటప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని ఆ తర్వాత రష్మిక మందన కి వరుసగా సినిమా ఆఫర్లు రావడంతో తన కెరియర్ పై దృష్టి పెట్టిందని అంతే తప్ప వేరే కారణాలు ఏమీ లేవని తన అభిమానులు స్పందిస్తున్నారు. ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం రష్మిక వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంది. ఈ కన్నడ బ్యూటీ ప్రముఖ తమిళ హీరో విజయ్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. అంతేకాకుండా తెలుగు, తమిళం, హిందీ తదితర భాషలలో నటిస్తుంది.

Read Also : Rashmika Mandanna : గుంటూరు మిర్చిలా రెడ్ డ్రెసులో మంటపుట్టిస్తోన్న రష్మిక.. గ్లామర్ డోస్ తగ్గేదేలే అంటున్న శ్రీవల్లి..!

Advertisement
Exit mobile version