RGV: దివంగత నటుడు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురించి మనందరికీ తెలిసిందే. పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం సినీ ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పవచ్చు. ఇప్పటికీ పునీత్ మరణవార్తను ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మాటలు, పూర్తి చేసిన మంచి పనులు ఇంకా కళ్లముందు మెదులుతూనే ఉన్నాయి. ఇక ఇది ఇలా ఉంటే టాలీవుడ్ సంచలన దర్శకుడు తాజాగా పునీత్ రాజ్ కుమార్ ఘాట్ ను సందర్శించారు. ఈ సందర్భంగా పునీత్ గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, చిత్ర బృందం ఖత్రా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెంగుళూరు వెళ్లారు.
ఇకపోతే పునీత్ రాజ్ కుమార్ విషయానికి వస్తే..పునీత్ కన్నడ సూపర్ స్టార్ అయినా డాక్టర్ రాజ్ కుమార్ చిన్న కుమారుడు అన్న విషయం తెలిసిందే. మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పునీత్, ఆ తర్వాత 2002లో వచ్చిన అప్పు సినిమాతో సంచలనం సృష్టించారు. ఆ వరుస హిట్లతో అందుకుంటూ కన్నడ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకున్నారు. అంతేకాకుండా కన్నడ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని విధంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకున్నారు.
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి అండగా నిలిచారు. అంతేకాకుండా ఎంతోమంది బీదవారికి చిన్నారులకు సొంత ఖర్చుతో చదువు చెప్పించారు. అంతేకాకుండా తాను చనిపోయిన కూడా తాను చేస్తున్న మంచి పనులు నిలిచి పోకూడదు అన్న ఉద్దేశంతో కొన్ని కోట్లు అతని పేరుమీద డిపాజిట్ చేసి పెట్టారు. ఇక పునీత్ ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటూ తరచుగా వ్యాయామం చేస్తూ ఫిట్ గా ఉండే పునీత్ ఇలా 46 ఏళ్ళ చిన్న వయసులోనే ప్రాణాలను కోల్పోవడం అన్నది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలను శోకసంద్రంలో ముంచేసింది. ఇప్పటికీ ఆయన లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు.
Read Also : Ali Reja: ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదే… అలీ రేజా షాకింగ్ కామెంట్స్..!