Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ramya Raghupathi : రమ్య రఘుపతి వ్యాఖ్యలపై స్పందించిన పవిత్ర లోకేష్?

Ramya Raghupathi : నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి నటి పవిత్ర గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె వల్లే నాకు నరేష్ కు మధ్య గొడవలు వచ్చాయని మేమిద్దరం విడిపోవడానికి కారణం ఆమె అంటూ రమ్య పవిత్ర గురించి ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేను ఎప్పటినుంచో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే, నాతోపాటు నరేష్ గారి గురించి ఆయన కుటుంబం గురించి మీ అందరికీ తెలిసిందే. అయితే మా ఇద్దరి గురించి కన్నడ మీడియాలో ఎంతో తప్పుగా మాట్లాడారు.

pavitri-lokesh-reacts-to-ramya-raghupathi-comments

నేను నరేష్ పలు సినిమాలలో నటించడం వల్ల మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని ఆమె కన్నడ మీడియాతో తప్పుగా ప్రచారం చేయించారు. ఈ విధంగా నన్ను ఒక బాధ్యతరాలుగా ప్రచారం చేసి చూపించారు.రమ్యకు నరేష్ గారికి ఏవైనా మనస్పర్ధలు ఉంటే వారి కుటుంబ వ్యవహారాలు వారి కుటుంబంలోనే చూసుకోవాలి కానీ ఇలా ఒకరిపై నిందలు వేస్తూ వారిని అవమానించడం సరికాదని పవిత్ర లోకేష్ వెల్లడించారు.

నిజా నిజాలు తెలియకుండా రమ్య రఘుపతి నా గురించి నరేష్ గారి గురించి చేసిన వ్యాఖ్యలు తనని ఎంతగానో బాధించాయని ఈ సందర్భంగా రమ్య చేసిన వ్యాఖ్యలపై నటి పవిత్ర లోకేష్ స్పందించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ వ్యాఖ్యలపై రమ్య ఎలా స్పందిస్తారో తెలియదు. మొత్తానికి రమ్య నరేష్ పవిత్ర లోకేష్ మధ్య ట్రయాంగిల్ వివాదం చెలరేగుతుంది. మరి ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Read Also : Actor Naresh: నా భార్య డ్రైవర్ తో ఎఫైర్ పెట్టుకుంది.. ఎట్టకేలకు తన భార్య గురించి ఓపెన్ అయిన నరేష్?

Exit mobile version