Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Niharika : పవన్ కల్యాణ్ పై నిహారిక కామెంట్లు.. మెగా డాటర్ ను తిట్టిపోస్తున్ననెటిజెన్లు!

Niharika : మెగా డాటర్ నిహారిక గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తన బాబాయ్ అయిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆమె చేసిన ఓ పోస్టు వైరల్ గా మారింది. నెటిజెన్లు ఆమెను తిట్టి పోస్తున్నారు. అసలు ఏమైంది, ఎందుకు ఆమెను నెటిజెన్లు ట్రోల్ చేస్తున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇటీవల ఏపీలో అప్పుల బాధ భరించలేక కొంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇలా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడానికి పూనుకున్నారు పవన్ కల్యాణ్. అందులో భాగంగానే ఓ కార్యక్రమాన్ని మొదలు పెట్టి విరాళాలు సేకరిస్తున్నారు.

Niharika

అయితే ఈ సేకరణలో భాగంగా వరుణ్ తేజ్ 10 లక్షలు, సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు, వైష్ణవ్ తేజ్ 5 లక్షలు, నిహారిక 5 లక్షలు విరాళం ఇచ్చారు. ఇలా మొత్తంగా 35 లక్షల రూపాయలను మెగా ఫ్యామిలీ కౌలు రైతుల కోసం ఇచ్చింది. అయితే వీరికి పవన్ కల్యాణ్ థాంక్యూ చెబుతూ ఓ పోస్టు చేశారు. దానికి నిహారిక రిప్లై ఇస్తూ… ” కల్యాణ్ బాబాయ్ చాలా థాంక్స్. ప్రజలకు సహాయం చేయడానికి మాకు కూడా కొంత అవకాశం ఇచ్చారు. నేను ఎల్లప్పుడూ ఎదురు చూసే ఒక మంచి నాయకుడు మీరు. మీతోనే జనానికి మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నానంటూ” పోస్టు చేసింది.

ఈ ట్వీట్ ని చూసిన జన సైనికులు మురిసిపోతుంటే.. మెగా అభిమానులు మురిసిపోతుండగా… కొంత మంది నెటిజెన్లు ఎదురుదాడి చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీని, నిహారికను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా పబ్ విషయాన్ని తీస్కొస్తు ఇష్టమొచట్గా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement


Read Also :  Niharika : కొంతకాలంగా సైలెన్స్ మెయింటైన్ చేస్తున్న నీహారిక.. కారణమేంటి…?

Advertisement
Exit mobile version