Nagarjuna -Akhil: అక్కినేని నాగార్జున ప్రస్తుతం హీరోగా వెండితెరపై సందడి చేయడమే కాకుండా బుల్లితెరపై కూడా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలు వరుస టీవీ కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉన్న నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ది ఘోస్ట్ చిత్రంతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర చిత్రంలో కూడా నాగార్జున కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున, అఖిల్ కలిసి మనం సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇక పెద్ద కుమారుడు నాగచైతన్యతో కలిసి బంగార్రాజు చిత్రం ద్వారా ప్రేక్షకులను సందడి చేసిన నాగార్జున తదుపరి చిత్రంలో తన చిన్న కొడుకుతో కలిసి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే వరకు వేచి చూడాలి.
