Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Megastar Chiranjeevi: ట్విట్టర్ పేరు మార్చుకున్న మెగాస్టార్… మనసును హత్తుకునే వీడియో షేర్ చేసిన చిరు!

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది. ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి తన ట్విటర్ ఖాతా పేరు మార్చుకొని సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పటివరకు చిరంజీవి కొణిదెల అని ఉన్న తన ట్విట్టర్ పేరును కాస్తా, ఆచార్య గా మార్చుకున్నారు.

ఈ విధంగా ట్విట్టర్ ఖాతా పేరుగా మార్చుకొని ఆచార్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ట్విట్టర్ ఖాతా నుంచి ఒక అద్భుతమైన మనసును హత్తుకునే వీడియోని షేర్ చేశారు. చిరంజీవి అని పేరు పెట్టుకున్న ఈయన నేడు హనుమాన్ జయంతి కావడంతో అందరికీ ట్విట్టర్ వేదికగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే… ఆచార్య సినిమా సెట్ లో భాగంగా రామ్ చరణ్ మేకప్ అవుతుండగా అక్కడికి హనుమ ప్రతిరూపమైన ఒక వానరం వచ్చింది. రామ్ చరణ్ మేకప్ అవుతన్నంత సేపు వానరం అక్కడే ఉండి రామ్ చరణ్ ను తీక్షణంగా చూస్తూ ఉండిపోతుంది.ఆ సమయంలో రామ్ చరణ్ ఆ వానరానికి బిస్కెట్లు అందించినటువంటి వీడియోని చిరంజీవి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ ఈ వీడియోకి హనుమ శ్లోకమైన ‘శ్రీ ఆంజనేయం.. ప్రసన్న ఆంజనేయం’ను బ్యాగ్రాండ్ గా చిరంజీవి పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement
Exit mobile version