Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ram Charan-Upasana : చరణ్, ఉపాసన వరలక్ష్మి వ్రతం చూశారా? కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్!

Ram Charan-Upasana : టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతని భార్య ఉపాసన గురించి తెలియని వారంటూ ఉండరు. ఉపాసన ఒక కోడలిగా మంచి భార్య గా తన బాధ్యతలను చక్కగా నిర్వహిస్తోంది. ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే కోడలిగా ఇంటి బాధ్యతలు, భార్య గా రామ్ చరణ్ పనులు చూసుకుంటుంది. ఇక ఉపాసన అపోలో ఇన్చార్జి గా వ్యవహరిస్తున్నప్పటికీ ఆమె ఎలాంటి హంగులు, ఆర్బాటాలు లేకుండా చాలా సింపుల్ గా ఉంటుంది. ఇక కెరీర్ పరంగా ఆమె ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. కాగా ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది ఫాలోవర్స్ ని తన సొంతం చేసుకుంది.

Mega Power Star Ram Charan Celebrates Janmashtmi With Wife Upasana Konidela, Photos Viral

ఈమెకు సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు ఉన్నారు. ఆరోగ్యకరమైన సందేశాలను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇక అదే విధంగా హెల్త్ రెసిపీస్ తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక విషయాల గురించి తన అభిమానులు అందరికీ చెప్తుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి తన భర్త రామ్ చరణ్ కి సంబంధించిన విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటుంది.

Ram Charan-Upasana : ఆది దంపతుల్లా చరణ్, ఉపాసన.. 

ఇక రామ్ చరణ్, ఉపాసన కలిసి ఏ వెకేషన్ కి వెళ్ళినా కూడా ఆ ఫోటోలని పోస్ట్ చేస్తుంది. అలాగే సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు గురించి కూడా తన అభిమానులతో పంచుకుంటుంది. రీసెంట్ గా రామ్ చరణ్, ఉపాసన కలిసి పూజ చేసిన ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేసింది. ఇక ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా మెగా ఇంట్లో ప్రత్యేకంగా పూజలు నిర్వహించినట్లు తెలుస్తోంది. పూజ గది మొత్తం పూలతో చాలా అందంగా అలంకరించారు. చరణ్, ఉపాసన దంపతులు ఇద్దరూ కలిసి ప్రత్యేకంగా పూజలు చేశారు.

Advertisement

Read Also : Lavanya Tripathi : వరుణ్ తేజ్‌తో ఎఫైర్.. ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్‌‘పై లావణ్య త్రిపాఠి క్లారిటీ ఇచ్చేసిందిగా..!

Advertisement
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?
Exit mobile version