Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Niharika Konidela: ఐలవ్యూ అంటూ ఓ అబ్బాయి ఫొటో షేర్ చేసిన మెగా డాటర్, అతనెవరంటే?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. పెల్లికి ముందు ఆమె ఎలా ఉందో పెళ్లికి తర్వాత కూడా అలాగే ఉంది. కాగా నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఓవైపు కెరియర్ పరంగా ముందుకెళఅతూనే తన భర్త చైతన్యతో కలిసి టూర్లు కూడా తిరుగుతోంది. ఇకపోతే నిహారికకు ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఆమె పెళ్లికి వచ్చిన స్నేహితులను చూస్తే ఆ విషయం పూర్తిగా అర్థం అవుతుంది. అయితే నిహారికతో పాటు కలిసి పని చేసిన దర్శకుడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన గ్యాంగ్, స్కూల్, కాలేజ్ ఇలా సవాలక్ష మంది స్నేహితులున్నారు. తాజాగా నిహారిక తన స్నేహితులకు సంబంధించిన ఓ పోస్ట్ చేసి ప్రేమను కురిపించింది.

హ్యాపీ బర్త్ డే ఖైరి బాబు. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెల్సు అనుకుంటున్నాను. నా అవసరాల్లో అండగా, నాకు తోడుగా ఉన్నందుకు థాంక్స్. ఈ ప్రంపంచంలోని సంతషమంతా కూడా నీకు దక్కే అర్హత ఉంది. ఐ లవ్ యూ అంటూ విషెస్ చెప్పింది. నీ అద్భుతమైన గాత్రంలో ఇంకా ఎన్నో మంచి పాటలు పాడాలని కోరింది.

Advertisement
Exit mobile version