Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Sitara Dance : సితార‌ డ్యాన్స్‌ చూశారా? సినిమాల్లో ఎంట్రీ ఎప్పుడంటే.. వీడియో!

Sitara Dance : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార పెన్నీ సాంగ్ తో ఫుల్ పాపులర్ అయిపోయింది. సర్కారువారి పాట మూవీ సాంగ్ ప్రమోషన్‌లో సితార డ్యాన్స్ అదరగొట్టేసింది. తండ్రి తగ్గ తనయ అనిపించుకుంది సితార. సితార పర్ఫార్మెన్స్ చూస్తుంటే.. ఇండస్ట్రీకి పెద్ద హీరోయిన్ దొరికేసింది అనేస్తున్నారు. సర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మహేశ్ కూడా సినిమాల్లోకి సితార ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. రాబోయే ఫ్యూచర్‌లో సితార గొప్ప హీరోయిన్ అవుతుంది మహేశ్ చెప్పాడు.

మహేశ్ బాబు ఫ్యాన్స్‌ అంతా ఫుల్ ఖుషి అవుతున్నారు. మహేశ్ వారసురాలిగా సితార సినిమాల్లోకి ఎంట్రీ ఎప్పుడు ఇస్తుందాని ఎదురుచూస్తున్నారు. స్టార్ కిడ్ తండ్రిని మించి చిన్నప్పుడే పాపులారిటీ సంపాదించుకుంటుంది. ఇప్పుడు సితార డ్యాన్స్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాప్ హీరోయిన్ సమంతతో సితారకు మంచి రిలేషన్ ఉంది. చాలాసార్లు పలు ఇంటర్వ్యూల్లో సితార సమంతతో తన అనుబంధాన్ని చెబుతూనే ఉంటుంది సితార.

Mahesh Babu Daughter Sitara Cute Dance on Social Media Viral

తన బెస్ట్ ఫ్రెండ్ సమంత అని చెప్పింది సమంతతో ఎక్కువ సమయం సరదాగా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. బ్రహ్మోత్సవం షూటింగ్ జరిగే సమయంలో మహేష్ బాబుతో కలిసి సెట్స్‌లో సమంతతో సరదాగా గడిపానని సితార చెప్పుకొచ్చింది. సమంతతో సరదాగా ఆడుకోవడం తనకు ఇష్టమని సితార తెలిపింది. సితార వెకేష‌న్ టూర్ ఎంజాయ్ చేస్తోంది. క్యూట్ వీడియోకు డ్యాన్స్ చేస్తూ తన ఇన్ స్టాలో షేర్ చేసింది. ఇప్పుడా ఆ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Read Also : 

Advertisement
Exit mobile version