Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Liger Movie Review : లైగర్‌ మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ సినిమా మిస్ ఫైర్ అయిందా?!

Liger Movie Review Vijay deverakonda starrer Liger Movie Review

Liger Movie Review Vijay deverakonda starrer Liger Movie Review

Liger Movie Review : లైగర్.. విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్.. సినిమా రిలీజ్‌కు ముందే అంత హైప్ క్రియేట్ అయింది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ మూవీని ప్రమోషన్లతో భారీ అంచనాలను పెంచేసింది. విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు సినిమా రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ సమయం రానే వచ్చింది. మన లైగర్ బాయ్ ఆగస్టు 25న లైగర్ (Liger Movie Release) థియేటర్లలో థియేటర్లలోకి వచ్చేశాడు. లైగర్ మూవీతో విజయ్ దేవరకొండ ( ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

Liger Movie Review Vijay deverakonda starrer Liger Movie Review

లైగర్ మూవీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది. అందులోనూ విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా మూవీ కావడం, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రావడంతో మరింత క్యూరియాసిటీని పెంచేసింది. లైగర్ మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ అంతాఇంతా కాదు. ఈ మూవీని ఇండియా అంతటా ఫుల్ ప్రమోషన్ చేశారు. విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే ప్రచార బాధ్యతలను తమ భుజనా వేసుకున్నారు. ఇంతకీ లైగర్ బాయ్ మూవీ ప్రేక్షకుల అంచనాలకు తగినట్టుగా ఉందా? విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఎంతవరకు మెప్పించాడు అనేది తెలియాలంటే వెంటనే రివ్యూలోకి వెళ్లాల్సిందే..

అసలు స్టోరీ ఇదే (Story) :
లైగర్ (విజయ్ దేవరకొండ), అతడి తల్లిగా బాలామణి (రమ్య కృష్ణ) నటించింది. వీరిద్దరూ కరీంనగర్‌ నుంచి ముంబైకి వెళ్తారు. మొదట్లో ఏం చేయాలో తెలియక ముంబై మహానగరంలో ‘చాయ్’ దుకాణాన్ని నడుపుతారు. అయితే బాలామణికి తన కొడుకును బాక్సింగ్ ఛాంపియన్‌ చేయాలని కలలు కంటుంటుంది. కానీ, బాక్సింగ్ నేర్చుకోవాలంటే డబ్బు కావాలి. అప్పుడే బాలమణి లైగర్‌కు తన తండ్రి ఎవరూ అనే చేదు నిజాన్ని బయటపెడుతుంది. అక్కడే మూవీకి టర్నింగ్ పాయింట్. ఇంతకీ లైగర్ తండ్రి ఎవరు? బాలామణి స్టోరీ ఏంటి? లైగర్ బాక్సర్ అయ్యేందుకు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు అనేది తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే..

Advertisement
Liger Movie Review Vijay deverakonda starrer Liger Movie Review

నటీనటులు వీరే (Movie Cast) :
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే లీడ్ రోల్ చేశారు. ఇక లైగర్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటించారు. అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, రోనిత్ రాయ్, విషు రెడ్డి ఇతర పాత్రల్లో నటించారు. మూవీకి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. సినిమాటోగ్రఫీని విష్ణు శర్మ అందించగా.. సంగీతాన్ని అజీమ్ దయాని సమకూర్చారు. లైగర్ మూవీకి జునైద్ సిద్ధిఖీ, ఎడిటర్ కాగా, ఛార్మీ కౌర్, పూరి జగన్నాధ్, కరణ్ జోహార్, హిరూ యష్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాతలుగా వ్యవహరించారు.

Movie Name :  Liger Movie (2022)
Director :   పూరీ జగన్నాధ్
Cast :  విజయ్ దేవరకొండ,అనన్య పాండే,రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను
Producers : పూరి జగన్నాధ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా మరియు హిరూ యష్ జోహార్
Music :  అజీమ్ దయాని
Release Date : 25, ఆగస్టు 2022

Liger Movie Review : లైగర్ సినిమా ఎలా ఉందంటే? :

గతంలో తెలగు సినిమాలు చాలానే బాక్సింగ్ బ్యాక్ డ్రాప్‌తో వచ్చాయి. అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు మూవీ. సూపర్ హిట్ అయింది. పూరీ, రవితేజ కాంబినేషన్‌లో అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి మూవీ కూడా వచ్చింది. ఇది కూడా హిట్ టాక్ అందుకుంది. మళ్లీ అదే బ్యాక్ డ్రాప్‌తో పూరి లైగర్ అంటూ ముందుకు వచ్చాడు. స్టోరీ విషయానికి వస్తే.. పూరి ఎప్పటిలానే హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేశాడు. యాక్షన్ సీక్వెన్స్ మొదలుపెట్టి హైదరాబాద్ నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి నేరుగా స్టోరీ ముంబైకి సిప్ట్ అవుతుంది.

Liger Movie Review Vijay deverakonda starrer Liger Movie Review

బతుకుదెరువు కోసం వెళ్లిన బాలమణి, లైగర్ అక్క ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది స్టోరీ. అయితే ఇక్కడే ప్రేక్షకులకు కొంచెం చిరాకు తెప్పించేలా అనిపిస్తుంది. పూరి హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అందులో పూరీ డైలాగ్‌లకు తిరుగులేదు. అన్నిలైగర్‌లో మూవీలో చూపించాడు. కానీ, ఇవేమి పాన్ ఇండియా రేంజ్ మూవీకి తగినట్టు లేవని అనిపించింది. ఇక ఫస్ట్ హాఫ్ ఆసక్తికరంగానే సాగుతుంది. ఎక్కడో కొంచెం లైగర్ ఆడియెన్స్ ను ఎంగేజ్ చేయలేకపోయారని చెప్పవచ్చు. ఫస్ట్ హాఫ్‌లో లవ్ స్టోరీ, ఇతర సీన్ల కొంచెం సాగదీతగా ఉంటుంది. సెకండ్ హాఫ్ చూస్తే.. మొత్తం బాక్సింగ్ సీక్వెన్స్‌లతో హైలట్ అయింది.

Advertisement

లైగర్ మూవీలో ఇక్కడే దెబ్బ కొట్టిందా? :

ఇందులో మైక్ టైసన్ పెట్టడం ద్వారా మూవీకి ఎంతవరకు ప్లస్ అయిందో తెలియదు కానీ, కొంతవరకు అది మిస్ ఫైర్ అయినట్టుగా కనిపిస్తోంది. ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉండాల్సింది. కొన్ని సీన్లను కట్ చేసి ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలా చేసి ఉంటే బాగుండేది. బహుషా ఇక్కడే మిస్ ఫైర్ అయి ఉండొచ్చు.. లైగర్‌గా విజయ్ అద్భుతంగా నటించాడనే చెప్పాలి. అందులో విజయ్ నత్తిగా మాట్లాడటం అనేది కొత్తగా అనిపించింది. ఏది ఏమైనా ఎమోషన్స్‌ క్యారీ చేయడంలో లైగర్ ఫెయిల్ అయ్యాడనే చెప్పవచ్చు. విజయ్ దేవరకొండ.. ఒక బాక్సర్ గా కనిపించేందుకు పడిన కష్టానికి కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.

Liger Movie Review Vijay deverakonda starrer Liger Movie Review

అతడి మేక్ ఓవర్ సూపర్.. ఇక హీరోయిన్ అనన్య పాండేకు మూవీలో పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. శివగామిగా పేరొందిన రమ్యకృష్ణ బాలమణి పాత్రలో అద్భుతంగా నటించింది. ఈ మూవీలో రమ్య బాడీ లాంగ్వేజ్, ఆమె డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శ్రీను, రోనిత్ రాయ్, విషు రెడ్డి నటులు తమ పాత్రల మేరకు మెప్పించారు. లైగర్ మూవీలో పూరి మార్క్ కనిపించింది. కానీ, పాత సినిమాల్లా పెద్దగా అనిపించలేదు. లైగర్ మూవీని మాస్ ప్రేక్షకులతో కనెక్ట్ చేయడంలో పూరీ టేకింగ్ వర్కౌట్ అయింది. టెక్నికల్ పరంగా చూస్తే.. లైగర్‌ అద్భుతంగా వచ్చింది.

Advertisement

అలాగే నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా వచ్చాయి. మూవీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ బాలీవుడ్‌కు సంగీత దర్శకులు, అజీమ్ దయాని అందించారు. అయితే పాటలు మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా అందించారు. మొత్తం మీద లైగర్‌ మూవీ.. ప్రతిఒక్కరూ థియేటర్లకు వెళ్లి చూడదగిన మూవీ.. బాక్సింగ్, విజయ్ దేవరకొండ ఇలా చూడాలని కోరుకునే వారికి విజువల్ ఫీస్ట్ అని చెప్పవచ్చు. లైగర్ మూవీ మాస్ ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు. ఇప్పటివరకూ చూడని పాత్రలో విజయ్‌ను చూడవచ్చు. లైగర్ మూవీలో విజయ్ నట విశ్వరూపాన్ని చూడాలంటే థియేటర్లకు వెళ్లి చూస్తూనే బాగుంటుంది.

[ Tufan9 Telugu News ]
 లైగర్ మూవీ (Liger Movie)
రివ్యూ & రేటింగ్: 2.5/5

Read Also : Liger Movie First Reivew : లైగర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసిందిగా.. పూరీ మార్క్, విజయ్ యాక్షన్.. పైసా వసూల్ మూవీ!

Advertisement
Exit mobile version