Keerthy Suresh: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట నేను శైలజ ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ అతి తక్కువ సమయంలోనే పలు సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా రాణిస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. మహానటి సినిమాతో అశేష ప్రేక్షకాదరణ పొందింది. కీర్తి సురేష్ కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది. ఇకపోతే ఇటీవలే దర్శకుడు కృష్ణ చైతన్య, శర్వానంద్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో కీర్తి సురేష్ ఒక తల్లి పాత్రలో నటించబోతోంది. అదే విధంగా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. అదే విధంగా నాని నటిస్తున్న దసరా మూవీలో నటిస్తోంది.