Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Hyper aadi: ఏంటీ.. ఆది ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తాడా.. అదీ ఒక్క జబర్దస్త్ షో ద్వారానేనా?

Hyper aadi: మాట మాటలోనూ పంచు వేసే హైపర్ ఆది గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కున్న అతను జబర్దస్త్ షో ద్వారా చాలా పేరు సంపాదించుకున్నాడు. ఈ షో వల్లే తన వల్ల అమ్ముడుపోయిన పొలాన్ని తన తండ్రికి కొనివ్వగలిగానని కూడా చెప్పాడు. అయితే ఒ షో ద్వారా అతను బాగానే సంపాదించుకున్నాడట.

జబర్దస్త్ ద్వారా వచ్చిన క్రేజ్ తోనే హైపర్ ఆది ఇంటితో పాటు చాలా ఆస్తులు పోగు చేయగల్గాడట. అంతే కాదు దీని వల్ల వచ్చి క్రేజ్ వల్లే రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
సుడిగాలి సుధీర్, హైపర్ ఆది లాంటి స్టార్ కమెడియన్లు నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ ను వీడినప్పటికీ… వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో కంటిన్యూ అలుతున్నారు.

Advertisement

హైపర్ ఆది గట్టిగానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. సంవత్సరానికి కోటి రూపాయల వరకు ఆదాయం వస్తోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య కాలంలోనే హైపర్ ఆది తన ఊరిలో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తు చేసుకున్నాడు. ఊర్లో ఆయనకు ఉన్న ఆస్తులు అప్పుల గురించి చెప్పాడు ఆది. తన చదువుల కోసం చాలా అప్పు చేసినట్లు వెల్లడించాడు.

దాదాపు రూ. 20 లక్షల రూపాయలు అప్పు ఉందని తెలిపాడు. ఆది చదువు పూర్తి అయ్యాక హైదరాబాద్ వచ్చే సమయంలో తన తండ్రి వేరే వాళ్ల దగ్గర అప్పు తీసుకుని డబ్బు ఇచ్చాడని గుర్తు చేసుకున్నాడు. హైదరాబాద్ కు అయితే వచ్చాడు కానీ సెటిల్ కావాడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు.

Advertisement
Exit mobile version