Sudheer -Rashmi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రష్మీ సుధీర్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ జంటకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని వీరి చేత పలు కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు.ఇకపోతే నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు అలాగే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా రష్మీ సుధీర్ లవ్ స్టోరీ గురించి ఈమెకు పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. వారిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్ నిజమేనా అంటూ ఇంద్రజను ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నపై స్పందిస్తూ వారిద్దరి మధ్య లవ్ స్టోరీ అనేవి పూర్తిగా వారి వ్యక్తిగత విషయాలని, వారి వ్యక్తిగత విషయాల గురించి తాను మాట్లాడ దలుచుకోలేదని ఈమె సమాధానం చెప్పారు.అయితే వారిద్దరి మధ్య లవ్ ఉందా అనే విషయం గురించి మాత్రం తెలియదని ఇంద్రజ తెలిపారు.