Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Ram Charan : బాబాయ్ తో సినిమా చేయాలనే కోరిక ఉంది.. నేనే ఆ సినిమాని నిర్మిస్తాం: రామ్ చరణ్

Ram Charan : కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీ విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రామ్ చరణ్ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి కూడా ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Ram Charan

ప్రస్తుతం ఆచార్య సినిమాలో తన తండ్రితో కలిసి సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ అతి త్వరలోనే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేస్తానని వెల్లడించారు.ఎప్పటి నుంచో బాబాయ్ తో కలిసి నటించడం కోసం ఎదురు చూస్తున్నానని మాకు సరిపడే కథ దొరికితే తప్పకుండా మా ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందని రామ్ చరణ్ వెల్లడించారు. ఈ విధంగా మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ఈ సినిమాని నా సొంత బ్యానర్ లోనే నిర్మిస్తానని రామ్ చరణ్ వెల్లడించారు.

ఈ విధంగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి సినిమా చేస్తాననే విషయం వెల్లడించడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అతి త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ సెట్స్ పైకి రావాలని భావిస్తున్నారు.ప్రస్తుతం రామ్ చరణ్ చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ సినిమా ఉంటుందని తెలియగానే వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఆచార్య సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మించిన సంగతి మనకు తెలిసిందే.

Advertisement

Read Also :Chiranjeevi: రాజమౌళితో సినిమా చేసిన హీరో తర్వాత ఫ్లాప్ మూటగట్టుకోవాలి… చిరు షాకింగ్ కామెంట్స్!

Exit mobile version