Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Actress samantha : నేను సైలెంట్ గా ఉన్నానంటే తప్పు ఒప్పుకున్నానని కాదంటూ సామ్ పోస్ట్..!

Actress samantha : ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులందరినీ మాయ చేసిన సమంత గురించి తెలియని వారుండరు. అయితే అక్కినేని నాగ చైతన్యతో ప్రేమాయణం, పెళ్లి, విడాకుల విషయాలపై విపరీతమైన చర్చలు జరిగేవి. అయితే సామ్ సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను ఎప్పటికప్పుడు ప్రేక్షకులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. మౌనం, దయ.. తదితర అంశాలపై బౌద్ధుల ఆథ్యాత్మిక గురువు దలైలామ రాసిన కోట్ ను చెప్పడమే ఇందుకు కారణం.

Actress samantha

నేను మౌనంగా ఉన్నానంటే పట్టించుకోవడం లేదని, ఏమీ మాట్లాడడం లేదా తప్పు అంగీకరించానని, నా దయా హృదయాన్ని బలహీనత అని మీరు పొరపడొద్దు. దయకూ ఓ ఎక్సై పైరీ డేట్ అంటుంది అనే మాటలతో ఓ ట్వీట్ చేసింది. దాంతో ఎవరిని ఉద్దేశించి సామ్ ఇళా ట్వీట్ పెట్టిందంటూ నెటిజెన్లు తలలు పట్టుకుంటున్నారు. ఆథ్యాత్మిక చింతనతో అలా పెట్టిందని కొందరు అంటుండగా.. ఓ నెటిజెన్ ట్రోల్ వల్లే ఇలా పెట్టిందని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read Also :Samantha Warning : నా మౌనం.. చేతిగానితనంగా తీసుకోవద్దు.. వారికి సమంత స్ట్రాంగ్ వార్నింగ్.. ట్వీట్ వైరల్..!

Advertisement
Exit mobile version