Anchor Suma: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుమ కనకాల గురించి అందరికీ తెలిసిందే. ఈమె కేవలం బుల్లితెర కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా ఏదైనా సినిమా వేడుక జరిగినా కూడా అక్కడ తను ప్రత్యక్షమవుతుంది. సినిమా ఈవెంట్ అంటేనే తప్పనిసరిగా ఆ వేడుకలో సుమ ఉండాల్సిందే. అంతగా తన కెరియర్ లో బిజీగా మారిపోయిన సుమ తాజాగా కేజిఎఫ్2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చిత్ర బృందాన్ని ఇంటర్వ్యూ చేశారు.
అందుకు యశ్ సమాధానం చెబుతూ హీరోలు వచ్చి మల్టీస్టారర్ సినిమా చేద్దామంటే తాను చేయనని, అదే మంచి డైరెక్టర్ వచ్చి ఆ హీరోతో మల్టీస్టారర్ చిత్రం చేయాలని చెప్పినప్పుడు నేను అతనితో చేయగలనో లేదో తెలుసుకొని చేస్తానని యశ్ షాకింగ్ సమాధానం చెప్పారు.ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా సుమ తాను కూడా పాన్ ఇండియా యాంకర్ గా మారిపోయానని తన గురించి తాను గొప్పలు చెప్పుకుంది. ఈ క్రమంలోనే హీరో మీరు ఎప్పుడో పాన్ ఇండియా యాంకర్ అయిపోయారు. కర్ణాటకలో కూడా మీరే ఈవెంట్ చేశారని గుర్తు చేశారు.ఈ మాటలకు సుమ స్పందిస్తూ నాకు పాన్ కార్డు మాత్రమే ఉందని, ఇంకా పాన్ ఇండియా యాంకర్ కాలేదని చెప్పుకొచ్చారు. అనంతరం హీరో మాట్లాడుతూ మీకు పాన్ ఉందో లేదో తెలియదు కానీ ఫ్యాన్స్ మాత్రం చాలామంది ఉన్నారంటూ సుమ పై తన దైన శైలిలో పంచ్ లు వేశారు.