Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Naga chaithanya: నాగ చైతన్య ధాంక్యూ ట్రైలర్ అదిరింది… మామూలుగా లేదుగా!

Naga chaithanya: టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని నట వారసుడు నాగ చైతన్య గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆయ ఇటీవలే నటించిన థాంక్యూ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమాలో నాగ చైతన్య పక్కన రాశీ ఖన్నా కనిపించబోతోంది. విక్రమ్ కుమార్ కే దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ నెల 22వ తేదీన ఈ సనిమా థియేటర్లలో సందడి చేయబోతోంది.

Hero naga chaithanya thank you movie trailer released

Naga chaithanya : నాగ చైతన్య ధాంక్యూ ట్రైలర్ రిలీజ్….

విభిన్న ప్రేమ కథతో ఈ సినిమా తెరకెక్కినట్లు ప్రచార చిత్రంలో చూపించిన సన్నివేశాలను బట్టి అర్థం అవుతోంది. క్లాస్, మాస్ గెటప్ లో చైతూ కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. కొన్ని సంభాషణలు యువ హృదయాలను తాకేలా ఉన్నాయి. ట్రైలర్ లో వినిపించిన సంగీతం విభిన్నంగా ఉంది. సీన్ కు తగ్గట్టు తమన్ అందించిన నేపథ్యం సంగీతం వినసొంపుగా ఉంది. అయితే చైతూ ప్రేమ ఎలా సాగింది.. ముగ్గురిలో ఎవరికి చైతూ దక్కుతాడు.. కథా, కథనం ఎలా ఉన్నాయి అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement
Exit mobile version