Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Extra Jabardasth Promo : ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లోకి గెటప్ శ్రీను రీఎంట్రీ.. అందుకే తిరిగి వచ్చాడా? నెక్స్ట్ సుధీర్..?

Extra Jabardasth Promo : జబర్దస్త్ నుండి పలువురు కమెడియన్లు తప్పుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. సుడిగాలి సుదీర్, గెటప్ శీను వంటి కమెడియన్లు తప్పుకోవడం వల్ల ఈ షో యొక్క రేటింగ్ పడిపోయింది. దీనితో ఫ్యాన్స్ కి కొంత నిరాశ మిగిలింది అని చెప్పవచ్చు. ఇక ఈ షోపై కిరాక్ ఆర్పి చేసిన ఆరోపణలు అంతా ఇంతా కాదు. జైలులో ఖైదీలకు పెట్టే భోజనం కంటే మల్లెమాల సంస్థ వారు పెట్టే భోజనం చాలా దారుణంగా ఉంటుంది అంటూ కామెంట్ చేశాడు. ఇక మల్లెమాల అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి ని కూడా వదల్లేదు. ఆయనపై కూడా విమర్శలు గుప్పించాడు.

Extra Jabardasth _ Getup Srinu Re-Entry into Extra Jabardasth Comedy Show

ఇక కిరాక్ ఆర్పి చేసిన విమర్శలను హైపర్ ఆది ,ఆటో రాంప్రసాద్ ,షేకింగ్ శేషు తీవ్రంగా ఖండించారు. అన్నం పెట్టిన సంస్థ పై ఆ విధంగా తీవ్ర విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇక జబర్దస్త్ మాజీ మేనేజర్ ఏడుకొండలు గారు ఆర్పీ పై విరుచుకుపడ్డారు. శ్యాం ప్రసాద్ రెడ్డి లాంటి వారిపై విమర్శలు చేసే అధికారం తనకు లేదన్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ నుండి వెళ్ళిపోయినా గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.

టైం వచ్చినప్పుడు నేనే వాటిని బయటపెడతాను. ఇక జబర్దస్త్ నుండి తప్పుకున్న వాళ్లంతా రోడ్లమీద తిరుగుతున్నారని ఏడుకొండలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సంఘటనల నేపథ్యంలో గెటప్ శ్రీను రీ ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. జూలై 29న ప్రసారమయ్యే ఎక్స్ట్రా జబర్దస్త్ షో లో గెటప్ శీను రీ ఎంట్రీ ఇచ్చినట్టు విడుదల చేసిన ప్రోమో లో తెలుస్తుంది. రాంప్రసాద్ స్కిట్ జరుగుతుండగా సడన్ గా గెటప్ శ్రీను ఎంట్రీ ఇస్తాడు. అతన్ని వేదికపై చూడగానే కంటెస్టెంట్స్ ఇంకా జడ్జెస్ ఆశ్చర్యానికి గురయ్యారు.

Advertisement

Extra Jabardasth : గెటప్ శ్రీను రీఎంట్రీతోనే అవమానం.. ఏడుకొండలు చెప్పిందే నిజమైందా?

Extra Jabardasth _ Getup Srinu Re-Entry into Extra Jabardasth Comedy Show

గెటప్ శ్రీను వచ్చాడు.. కాబట్టి ప్రస్తుతం చేసిన స్కిట్ ఆపేసి అతనితో కొత్త స్కిట్ చేస్తానని ఆపేసి అతనితో కొత్త స్కిట్ చేస్తానని ఆటో రాంప్రసాద్ అంటాడు. జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ గారు కూడా స్కిట్ ఆపేసి సరికొత్తగా గెటప్ శ్రీను తో చేయమని ఆటో రాంప్రసాద్ ని కోరుతుంది. ఇక గెటప్ శీను రీఎంట్రీ ఇవ్వడంతో పలు అవమానాలు తలెత్తుతున్నాయి. ఏడుకొండలు చెప్పినట్లు జబర్దస్త్ వదిలేసి వెళ్లిన వాళ్లకి నిజంగానే బయట అవకాశాలు దొరకవా? అనుకుంటున్నారు ప్రేక్షకులు.

జబర్దస్త్ నుండి బయటకు వెళ్లిన గెటప్ శ్రీను చాలా ఇబ్బందులు పడి ఉంటాడని అందుకే మళ్లీ జబర్దస్త్ కి రీ ఎంట్రీ ఇచ్చాడు అని వాదనలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏడుకొండలు చేసిన బెదిరింపుల కారణంగా వచ్చి ఉంటారని మరికొందరు అనుకుంటున్నారు. దీని వెనుక అగ్రిమెంట్ లేదా ఏదైనా బలమైన కారణం ఉండవచ్చని గెటప్ శీను ఫాన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా గెటప్ శీను మరల జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అందరినీ ఆనందం కలిగించే విషయం. ఇలా కొన్నాళ్లు పాటు మాత్రమే కొనసాగుతాడా లేదా శాశ్వతంగా ఇక్కడే ఉండి పోతాడా అనేది తెలియదు. ఈ విషయం గురించి తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Advertisement

Read Also : Sravana Bhargavi : శ్రావణ భార్గవికి కోట్లు తెచ్చిపెట్టిన వివాదం.. ఆ వీడియో డిలీట్ చేసి.. మరో వీడియో వదిలిందిగా!

Exit mobile version