F3 Movie: అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఎఫ్ 2 సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసింది ఈ క్రమంలోనే ఈ సినిమాకి సీక్వెల్ చిత్రంగా ఎఫ్ 3 వచ్చేనెల ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ప్రత్యేక పాట ఉండటం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఈ ప్రత్యేక పాటలో నటించడం కోసం ప్రత్యేకంగా కొందరు హీరోయిన్లు ఉండేవారు. కానీ ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ లో కూడా టాప్ హీరోయిన్ లు నటించడం గమనార్హం. ఇప్పటికే ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ ఇలా ఐటమ్స్ ద్వారా నటించి మంచి గుర్తింపు పొందారు.
This SUMMER is going to be 🔥🔥
AdvertisementGuess who joined the sets of #F3Movie for a SPECIAL SONG?😉💃#F3OnMay27 💫@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @ThisIsDSP @SVC_official @adityamusic @f3_movie pic.twitter.com/pxX2J24ELp
— Anil Ravipudi (@AnilRavipudi) April 15, 2022
తాజాగా మరోసారి ఈ బుట్ట బొమ్మ ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్లో నటించడం కోసం పూజా హెగ్డే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఒక రోజుకు సుమారు 50 లక్షల రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.పూజా హెగ్డే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఈ పాటను రెండు మూడు రోజులలో పూర్తి చేయాలని చిత్రబృందం భావించినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా మరోసారి బుట్ట బొమ్మ ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.