Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Nithin-amma rajashekar : హీరో నితిన్ పై అమ్మ రాజశేఖర్ ఫైర్.. నేనే పైకి తీసుకొచ్చా అంటూ..

Nithin-amma rajashekar : సినీ ఇండస్ట్రీలో ట్రస్ట్ అనే పదానికి మీనింగ్ తెలిసింది.. నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేది చాలా కొద్ది మంది మాత్రమే. అవసరం తీరే వరకు ఒకలా అవసరం తీరిన తర్వాత మరోలా ఉంటారని ఇండస్ట్రీ గురించి తెలిసిన వారు చెబుతుంటారు. తెలియని వారినైనా, తెలిసిన వారినైనా నమ్మాలంటే ఎంతో ధైర్యం చేయాల్సిందేనని చెబుతుంటారు. అలాంటి ఓ ఘటననే కోరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ బయట పెట్టారు. ఇప్పుడు అమ్మ రాజశేఖర్ మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

Nithin-amma rajashekar

Nithin-amma rajashekar : హీరో నితిన్ పై అమ్మ రాజశేఖర్ ఫైర్..

అసలేం జరిగిందంటే.. అమ్మ రాజశేఖర్ నిర్మాతగా, హీరోగా ఓ చిత్రం తెరకెక్కింది. దానికి సంబంధించిన కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించగా నితిన్ ఓకే చెప్పాడు. కానీ తీరా ఫంక్షన్ జరిగే సమయం నాటికి జ్వరం వచ్చిందని కార్యక్రమానికి రాలేనని చెప్పాడు నితిన్. అదే అమ్మ రాజశేఖర్ ఆగ్రహానికి కారణం అయింది.

నితిన్ కోసం గంటల తరబడి కూర్చుని ఏవీ చేయించాను. తను వస్తానని రాలేదు. రాకపోవడానికి కూడా కారణాలు లేవు. జ్వరమని అబద్ధం చెప్పాడని అమ్మ రాజశేఖర్ తన సినిమా ఫంక్షన్ లో తన ఆవేదనను వెల్లగక్కాడు. నితిన్ కు డ్యాన్స్ రాదు.. నేనే వాడికి నేర్పాను. అలాంటి గురువును మర్చిపోతాడా.. అమ్మనీ, గురువునీ మర్చిపోయిన వాళ్లు బాగుపడరు అంటూ తన కోపాన్నంతా చూపించేశాడు.

Advertisement

Read Also : Sai pallavi : సాయి పల్లవి రియ‌ల్ లైఫ్‌లో లవ్ స్టోరీ మామూలుగా లేదుగా!

Exit mobile version