- మెగా ఫ్యామిలీలోకి మరో ఇద్దరు వారసులు
- రామ్ చరణ్, ఉపాసన కొణిదెలకు కవలలు జన్మించారు
- ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ కవల పిల్లలు
- తాతయ్య, నానమ్మ అయ్యామంటూ చిరంజీవి పోస్టు వైరల్
Ram Charan Upasana : మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన దంపతులకు కవలలు జన్మించారు. జనవరి 31న (శనివారం) రాత్రి అపోలో ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చారు. కవలలో ఒకరు బాబు, ఒక పాప ఉన్నారు.
ఈ సంతోషకరమైన వార్తను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసి ఆనందం వ్యక్తం చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు ఇప్పటికే క్లింకార అనే కూతురు ఉంది.
ఇప్పుడు మరో ఇద్దరు కవలలను తమ జీవితంలోకి స్వాగతం పలికారు. మెగా వారసుడు వచ్చాడంటూ మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం జన్మించిన ఇద్దరు కవలలు, తల్లి క్షేమంగా ఉన్నారని చిరంజీవి తెలిపారు.
ఈ విషయం తెలిసిన వెంటనే సెలబ్రిటీలు, మెగా అభిమానులంతా కలిసి సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తున్నారు. మెగా ఫ్యామిలీలోకి మరో ప్రిన్స్, ప్రిన్సెస్ వచ్చారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
Ram Charan Upasana : తాతాయ్య, నానమ్మ అయ్యాం చిరంజీవి పోస్టు
‘‘రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులకు కవల పిల్లలు జన్మించారు. ఒక బాబు, ఒక పాప పుట్టారు. చాలా సంతోషంగా ఉంది. తల్లి, కవలలు అంతా ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారు. ఈ ఇద్దరిని మా కుటుంబంలోకి స్వాగతించడం చాలా ఆనందంగా ఉంది.
With immense joy and a heart full of gratitude, we are happy to share that @AlwaysRamCharan and @upasanakonidela have been blessed with twins – a baby boy and a baby girl.
Both the babies and the mother are healthy and doing well. ✨
Welcoming these little ones into our family…
Advertisement— Chiranjeevi Konidela (@KChiruTweets) January 31, 2026
తాతయ్య, నానమ్మగా ఎంతో ఆనందపడుతున్నాం. ప్రతి ఒక్కరి దీవెనలు, ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉంటాయని, అందరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం’’ అంటూ చిరంజీవి, సురేఖ పేరుతో పోస్ట్ చేశారు.
మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ ఉపాసనకు క్లింకార కుమార్తె ఉంది. మెగా ట్విన్స్ జన్మించడంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మెగా ఫ్యామిలీలోకి వారసుడు వచ్చాడంటూ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
అందరూ ఇంట్లో ఆడ పిల్లలే ఉన్నారని కనీసం ఒక్క వారసుడిని కనివ్వమని చరణ్ తో చెప్పేవాడినంటూ చిరంజీవి గతంలో ఒక మూవీ ఈవెంట్ సందర్భంగా అన్నారు. నాన్న కోరిక రామ్ చరణ్ ఇప్పుడు తీర్చాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
రామ్ చరణ్, ఉపాసన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2012 జూన్ 14న వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2023 జూన్ 20న క్లింకారకు జన్మనిచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు ఒక ఆడబిడ్డ, మగబిడ్డ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ట్విన్స్ రాకతో మెగా ఇంట సంబరాలు మొదలయ్యాయి.

