Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Charmy kaur: రిప్ రూమర్స్ అంటూ ఛార్మీ ట్వీట్.. అసలేం జరిగిందంటే?

Charmy kaur: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చార్మి.. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈమె… డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో లైగర్ మూవీ విచ్చన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత రోజు నుంచి ఈమె మీడియా ముందుకు రాలేదు. అంతకు ముందు అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తరచూ మీడియా ముందుకొచ్చారు.

Charmy kaur latest tweet about rumours

మైకులు పట్టుకొని ఆమె ప్రస్తుతం మాట్లడకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలానే పోస్టులు చేస్తున్నారు. అయితే లైగర్ సినిమా ప్లాప్ అడంతో… పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, ఛార్మి పై వస్తున్న రూమర్లను ఆమె స్పందించారు. రూమర్స్.. రూమర్స్.. రూమ్స్ అంటూ ట్వీట్ చేసారు. తనకు పూరీ జగన్నాథ్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవని, మాటలు కూడా లేవని వస్తున్న వార్తలన్నూ రూమర్లేనని కొట్టి పారేశారు.

తాను పూరీ జగన్నాథ్ చాలా స్నేహంగా ఉన్నామని.. అసలీ వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటూ ప్రశ్నించారు. అలాగే త్వరలోనే పూరీ కెనక్ట్స్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తుందంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం తామిద్దరూ కొత్త ప్రాజెక్టుపైనే ఫోకస్ చేసినట్లు వివరించారు. తాము అధికారికంగా చెప్పేవరకు ఏదైనా రూమరే అంటూ మరోసారి వివరించారు.

Advertisement
Exit mobile version