Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss6 : బిగ్ బాస్ లో ఈవారం కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్న కంటెస్టెంట్లు వీళ్లే?

Bigg Boss6 : దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షోగా గుర్తింపు పొందిన రియాలిటీ షో తెలుగులో కూడా ప్రారంభమై ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవల సెప్టెంబర్ 4వ తేదీ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 6 కూడా ప్రారంభం అయింది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పటికే ఈ సీజన్ మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలో కొనసాగుతోంది. ఇక ఇంటి సభ్యులు మొదటి వారంలోనే ఒకరితో ఒకరు గట్టి పోటీ ఇస్తూ బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులు పూర్తి చేస్తున్నారు. మొదటివారం లో నామినేషన్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో గెలవడానికి కంటెస్టెంట్లు మాటల యుద్ధానికి దిగారు. అయితే మొదటి వారంలో ఎలిమినేషన్ ని బిగ్ బాస్ రద్దు చేసాడు.

Bigg boss6 telugu show new updats

ఇక రెండవ వారంలో కూడా ఎలిమినేషన్స్ కోసం జరిగిన నామినేషన్లు చాలా రసవత్తరంగా జరిగాయి. ఈ వారంలో మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయ్యారు. అయితే వీరిలో ఒకరు మాత్రమే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వనున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్లు చాలా గట్టిగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చిన సిసింద్రీ టాస్క్ చాలా రసవత్తరంగా సాగుతోంది.

 

Advertisement

Bigg Boss6 : రెండవ వారం కెప్టెన్సీ టాస్క్..

కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ చాలెంజ్ లో చంటి గెలిచి కెప్టెన్సీ పదవి కోసం అర్హత పొందాడు. ఆ తర్వాత సెకండ్ ఛాలెంజ్ లో ఆర్జె సూర్య, ఇనయ సుల్తానా, రాజశేఖర్ గెలిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి నలుగురు కెప్టెన్సీ కోసం పోటీ పడుతున్నారు. వీరందరిలో ఎవరో ఒకరు ఈ వారం కెప్టెన్సీ పదవి దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయినా రాజశేఖర్, సాల్మన్ అతి తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది.

Read Also : Inaya Sultana : నేనేమీ పోర్న్ వీడియోలు చేయటం లేదుగా.. ఆర్జీవీతో డాన్స్ వీడియో పై స్పందించిన ఇనయ సుల్తానా..!

Advertisement
Exit mobile version