Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Swetha Varma : కోరిక తీర్చితే ఇల్లు ఇస్తామన్నారు.. శ్వేతా వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

Bigg Boss 5 Telugu Fame Swetha Varma Shocking Comments on Casting Couch

Bigg Boss 5 Telugu Fame Swetha Varma Shocking Comments on Casting Couch

Swetha Varma : అందం, అభినయం, నటించే ప్రతిభ ఉన్నా కొందరు చాన్స్ రాక గుర్తింపు పొందరు. అలాంటి వారు సినీ ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది శ్వేతా వర్మ. బిగ్ బాస్ రియాల్టీ షోలో చాలా మంది ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. మూవీస్‌లో యాక్ట్ చేయకముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసి ప్రేక్షకులకు చేరువైంది.

ఆమెకు నటనపై ఇంట్రెస్ట్, ప్రతిభ ఉన్నప్పటికీ దాన్ని ప్రూవ్ చేసుకునేందుకు మంచి చాన్స్ రాకపోవడంతో గుర్తింపు పొందలేకపోయింది. తాజాగా ఓ యూట్యాబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న వేధింపులను చెప్పుకుంది. అందరిలాగే సిల్వర్ స్కీన్‌పై తనను తాను చూసుకుని హ్యాపీగా ఫీల్ అవ్వాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినట్టు చెప్పుకొచ్చింది.

కానీ ఇండస్ట్రీ తాను ఊహించిన దాని కంటే భిన్నంగా ఉందన్నది. ఛాన్స్‌ల కోసం ట్రై చేస్తున్న టైంలో కొందరు తనను ఫిజికల్ గా లొంగదీసుకోవాలని చూశారని చెప్పింది. కొందరైతే ఏకంగా రోజుకు రూ.లక్ష, మూవీ ఆఫర్స్ ఇస్తామని ఆశ చూపారట. మరికొందరైతే తాము అడిగినప్పుడల్లా కోరిక తీరిస్తే ఇండస్ట్రీలో ఆఫర్స్ ఎక్కువగా ఉంటాయని, ఇల్లు, కారు వంటివి ఇస్తామంటూ లొంగదీసుకునే ప్రయత్నం చేశారని వాపోయింది. అయినప్పటికీ అలాంటి దారిలో తాను వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది.

Advertisement

ఒకానొక టైంలో ఇక ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాయని అనుకున్నదట. కానీ ఆమె ఫ్యామిలీ సపోర్ట్‌తో ఆఫర్స్ కోసం ట్రై చేసి విజయం సాధించానని చెబుతోంది. కొన్ని రోజులకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తనకు అలవాటయ్యాయి అని వాటిని పట్టించుకోవడం మానేసినట్టు చెప్పుకొచ్చింది ఈ భామ. ప్రస్తుం ఆమె పలు టాలీవుడ్ మూవీస్‌లో యాక్ట్ చేస్తూ బిజీబిజీగా ఉంటోది. తాజాగా ఆమె నటించిన రాణి అనే మూవీ ఓటీటీలో రిలీజై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో శ్వేత ప్రతిభను అందూ ప్రశంసిస్తున్నారు.

Read Also : Cockroaches Drink Beer : బొద్దింక‌ల‌ బీరు కోసం ఎగబడుతున్నారు.. భలే కిక్కు.. సూపర్ టేస్ట్ అంటున్న జనం..!

Advertisement
Exit mobile version