Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss 5 Telugu : నా భార్య ‘సిరి’లా ఉండాలంటున్న ‘జెస్సీ’.. తాను కూడా I love U చెప్పానని షాకింగ్ కామెంట్స్!   

bigg-boss-5-telugu-bigg-bos

bigg-boss-5-telugu-bigg-bos

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్ -5 బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ చాలా ఆసక్తిగా సాగుతోంది. కంటెస్టెంట్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. చూస్తుండగానే ఈ షో 12 వారాలు కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం ఏడుగురు సభ్యులు మాత్రమే హౌస్‌లో గేమ్ ఆడుతున్నారు. ఈ వారం ఎలిమినేషన్‌  ఎవరు కానున్నారనే దానిపై  సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో సభ్యుల మధ్య ఒక రకమైన బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ప్రేక్షకులకు మాత్రం వీళ్లు లవ్ లో ఉన్నారా? అనుకునేలా సభ్యుల ప్రవర్తన ఉంటుంది. ఇక ఈ సీజన్‌లో సిరి, షణ్ముక్ మధ్య జరిగే రొమాన్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఏకంగా ఒకే బెడ్ పై ఒకరినొకరు వాటేసుకుని మరి పడుకుంటున్నారు. వీళ్లిద్దరూ కావాలనే హద్దులు మీరుతున్నారా? రేటింగ్స్ కోసం బిగ్‌బాస్ కావాలనే వీరితో ఇలా చేయిస్తున్నారా? అని చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే, సిరి ష‌ణ్ముఖ్ ఎంత క్లోజ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. మొన్న సిరి మదర్, షన్నూ మదర్ వచ్చిన సమయంలో వీరి మధ్య జరుగుతున్న రొమాన్స్ విషయంలో వీరికి క్లాస్ ఇచ్చారు. వీరి ప్రవర్తన వలన కుటుంబసభ్యులు కూడా కొంత ఇబ్బంది పడుతున్నట్టు తెలిసింది. అయినా కూడా వీరు మాత్రం తమ మధ్య అతిని తగ్గించుకోవడం లేదు.

Advertisement

అయితే, సభ్యుల మధ్య హౌస్ లో ఉన్నంత క్లోజ్ నెస్ బయట ఉండదని గత సీజన్లలో ఆడిన సభ్యులు చెబుతున్నారు. కానీ, అనారోగ్యం కారణంగా మధ్యలోనే హౌస్ నుంచి బయటకు వచ్చేసిన జస్వంత్ అలియాస్ జెస్సీ సిరిపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సీజన్‌లో సిరి, షన్నూ, జస్వంత్‌లు ఒక జట్టుగా ఆడి త్రిమూర్తులుగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా సిరిపై త‌న‌కున్న లవ్‌ను బయటపెడ్డాడు జెస్సీ. తాజాగా ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెస్సీ సిరిపై ఉన్న అభిమానాన్ని బయటపెట్టాడు.

తనకు సిరి లాంటి భార్య వస్తే బాగుంటుందని తన మనసులో మాటను వెల్లగక్కాడు. తాను హౌస్ లో ఉన్నప్పుడు సిరి నన్ను ఎలా చూసుకుందో అందరికీ తెలిసిందే. అలాంటి అర్థం చేసుకునే అమ్మాయి కావాలంటూ బాంబ్ పేల్చాడు జెస్సీ.. తాను మోడలింగ్ లో ఉన్నప్పుడు ఎవరూ తనకు ప్రపోస్ చేయలేదని, బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక నాకు చాలా లవ్ ప్రపోజ్‌లు వస్తున్నాయని చెప్పాడు. అందరూ ‘జెస్సీ ఐ లవ్యూ, ఐ లవ్యూ అంటున్నారని.. ఐ లవ్ యూ అంటే ఎంటో అర్థం కాక తాను కూడా తిరిగి ఐ లవ్ యూ చెబుతున్నానని అన్నాడు. జస్వంత్ సిరి మీద చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Read Also : Raghu Karumanchi : మొన్నటివరకు సినిమాలు, జబర్దస్త్ కమెడియన్.. ఒక్కసారిగా బిజినెస్ మెన్‌గా అయిపోయాడు

Advertisement
Exit mobile version