Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Bigg Boss 5 Telugu : షన్నుపై సిరి లవర్ సీరియస్.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

Bigg Boss 5 Telugu : Bigg Boss Contestant Siri Hanmanth Lover Srihan Comments on shanmukh jaswanth 

Bigg Boss 5 Telugu : Bigg Boss Contestant Siri Hanmanth Lover Srihan Comments on shanmukh jaswanth 

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో చాలా ఇంట్రెస్టింగ్ పరిణామాలు చోటుచేసు కుంటున్నాయి. ఒకరినొకరు ఎలిమినేట్ చేసేందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. గొడవ పడుతున్నారు. ఇలాంటి వాటిని హైలెట్ చేస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది బిగ్ బాస్. గతంలో ఏ సీజన్ ప్రస్తుత సీజన్ లో ఉన్నన్ని కాంట్రవర్సీలు లేవు. ఇక హౌస్ లో షణ్ముక్, సిరి ప్రవర్తించే తీరుపైనా చర్చలు నడుస్తున్నాయి.

తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటూనే.. ముద్దులు, హగ్‌లు ఇచ్చిపుచ్చకుంటూ లిమిట్స్ దాటి బిహేవ్ చేస్తున్నారు. కానీ బయట వీరిద్దరు ఒకరిని ఒకరు ఇష్టపడేవారు కాదని టాక్. కానీ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ అయ్యాక వీరిరువురూ బాగా కనెక్ట్ అయిపోయారు. సిరి వాళ్ల తల్లి సైతం కొంచెం గట్టిగానే హెచ్చరించినా వీరు తీరు మారలేదు. బయట ఎన్ని రూమర్స్ వచ్చిననా.. ఎవరేమి అనుకున్నా.. వీరి రొమాన్స్ మాత్రం రోజురోజుకూ తారా స్థాయికి చేరుకుంటోంది.

ఇదిలా ఉండగా షణ్ముక్ బిహేవియర్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు సిరి లవర్ శ్రీహాన్.. ఎంతసేపు కూడా సిరి కారణంగానే తాను నెగెటివ్ అయ్యానని షణ్ముక్ అంటాన్నాడు. ఎవరి గేం ఏమిటో తెలసినా నెగెటివ్ అవ్వడం కాదు… ఒక వేళ సిరి గనుక తోడు లేకపోతే వేరే వారు సపోర్ట్ ఇవ్వకపోతే షణ్ముక్ పిచ్చోడు అయ్యేవాడు. కారణం ఎంటంటే అతడు ఎవరితోనూ కలిసిపోడు.

Advertisement

ఇక సిరి వేరే వారితో మాట్టాడినా, డాన్స్ చేసినా తప్పే అంటుంటాడు. చివరకు నవ్వినా కూడా తప్పే అంటూ చెబుతుంటాడు. షణ్ము తన ప్రపంచం అనేట్టుగా అక్కడి క్రియేట్ చేస్తూ సిరి మాత్రం ఏం చేయగలదు. ఎవరి వద్దకు వెళ్లగలదు.. ఫ్రెండ్ బాధపడకూడదు అని ఆలోచించి ఆగుతూ అడ్‌జెస్ట్ అవుతుంటే వీరు ఇచ్చి విలువ ఇదేనా..? అంటూ ఇన్ స్టా లో పోస్ట్ చేశాడు శ్రీహాన్.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Swetha Varma : కోరిక తీర్చితే ఇల్లు ఇస్తామన్నారు.. శ్వేతా వర్మ సెన్సేషనల్ కామెంట్స్..!

Advertisement
Exit mobile version