Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

NBK 107 teaser: భయం నా బయోడేటాలోనే లేదంటూ బాలయ్య గర్జన.. ఆగలేమంటున్న అభిమానులు!

NBK 107 teaser : నటసింహం నందమూరి బాలకృష్ణ నూతన చిత్రం ఎన్ బీకే 107 టీజర్ రిలీజైంది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఫస్ట్ హంట్ పేరుతో విడుదలైన ఈ సినిమాలో మాస్ డైలాగ్ లు, స్క్రీన్ ప్రెజన్స్ తో అభిమానులు ఈలలు వేస్తున్నారు. జూన్ 10వ తేదీ శుక్రవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడంతో నందమూరి ఫ్యాన్స్ అంతా పండుగ చేసుకుంటున్నారు.

NBK 107 teaser

అయితే మీ జీవో గవర్నమెంట్ ఆర్డర్.. నా జీవో గాడ్స్ ఆర్డర్, భయం నా బయోడేటాలోనే లేదు.. నరకడం మొదలు పెడితే ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా.. అంటూ పవర్ ఫుల్ డైలాగ్ లు చెప్పారు బాలయ్య బాబు. నెరిసిన గడ్డం, కొత్త హెయిర్ స్టైల్ తో అదుర్స్ అనిపించాడు. అయితే ఈ సినిమాకి తమన్ బాణీలు అందించగా.. శ్రుతి హాసన్ కథానాయికగా నటించింది.

అఖండ సినిమాలో తన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో నందమూరి అభిమానుల్ని ఉర్రూతలూగించిన తమన్.. మరోసారి ఫ్యాన్స్ ను ఖుషీ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాలో కన్నడ హీరో దునియా విజయ్ విలన్ గా కనిపించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Advertisement


Read Also : Balakrishna indian idol : 30 సూత్రాలతో భార్యని ఏమార్చడం ఎలా అనే పుస్తకం.. రాసింది మన బాలయ్య బాబే!

Exit mobile version