Karate Kalyani: కరాటే కళ్యాణి ఏ క్షణం అయితే యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డితో గొడవ పెట్టుకున్నారో ఆ క్షణం నుంచి ఈమె పలు వివాదాలను ఎదుర్కొంటున్నారు. ఇలా శ్రీకాంత్ రెడ్డితో గొడవ కారణంగా ఎంతోమంది సోషల్ మీడియా వేదికగా కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒకానొక సమయంలో యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా రెడ్డి కరాటే కళ్యాణి విషయంపై స్పందించి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక సినిమా ఎంత పవిత్రమో అలాంటి సినిమాలలో నువ్వు వేసే బాబీ పాత్రలు కూడా అంతే పవిత్రమా? నీకు కరాటే వచ్చు కదా అని కరాటే పనులు చేస్తే కర్మ నీతో కరాటి ఆడుకుంటుంది జాగ్రత్త. చెప్పేవన్నీ శ్రీరంగనీతులు చేసేవన్నీ ఇలాంటి పనులా? ఇలాంటి నీతి వ్యాఖ్యలు చెప్పే ముందు నువ్వు పవిత్రంగా ఉండు ఆ తరువాత ఇలాంటి నీతి వ్యాఖ్యలు బోధించు అంటూ శ్వేతా రెడ్డి కరాటే కళ్యాణి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.