Anchor Ravi – Rashmi: బుల్లితెరపై ఫీమేల్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత గుర్తింపు పొందారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమంలో 12 వారాల పాటు కొనసాగిన రవి ఎంతో గుర్తింపు పొందారు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు రవి విష్ణుప్రియ లాస్య శ్రీముఖి వంటి వారితో కలిసి పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించారు. ఇక బుల్లితెరపై యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రష్మీతో కలిసి రవి పలు కార్యక్రమాలలో సందడి చేశారు.
ఇక బుల్లితెరపై ఎంతో క్రేజ్ ఉన్న రష్మి సుడిగాలి సుధీర్ తో కలిసి పలు కార్యక్రమాలలో సందడి చేశారు బుల్లితెరపై ఈ జంటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈసారి సరికొత్త కార్యక్రమం ద్వారా యాంకర్ రవి రష్మి కలిసి చేసే హంగామా ఎలా ఉండబోతోందో తెలియాల్సి ఉంది. ఇక రవి ప్రస్తుతం బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.