Rashmi Gautam : యాంకర్ రష్మీ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఈమె గురించి తెలియని వారంటూ ఉండరు. తెలుగు బుల్లితెరపై తనదైన శైలిలో యాంకర్ గా రాణిస్తుంది. ఇక తన అందంతో తన క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంతోమంది అభిమానులను మూటగట్టుకుంది ఈ భామ. తనకు వచ్చీరాని తెలుగు లో ముద్దు ముద్దు మాటలతో అందర్నీ తన వలలో వేసుకుంది ఈ ఒడిస్సా బామ.
జబర్దస్త్ షో తో యాంకర్ గా పరిచయమైన ఈమె ఇక వెనుతిరిగి చూడలేదు. తెలుగులో అనేక షో లకు యాంకర్ గా వ్యవహరించింది. ప్రస్తుతం జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా వ్యవహరిస్తుంది. బుల్లితెరపై కాకుండా వెండితెరపై కూడా ఒక వెలుగు వెలిగింది. తన యాక్టింగ్ తో ఎంతోమందిని మంత్రముగ్ధుల్ని చేసింది.
ఇక సుధీర్ తో కలిసి ఈ అమ్మడు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు ఇప్పటికీ ఈ జంట పేరు వినగానే అసలైన ప్రేమ అంటే ఇలానే ఉంటుందేమో అనుకుంటారు ప్రేక్షకులు ఇక సుధీర్ తో తను నడిపిన లవ్ ట్రాక్ కి ఎంతోమంది ఫాన్స్ నీ మూటగట్టుకుంది. ఇక ఈమె షోలతో బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తుంది. అంతేకాకుండా మూగజీవుల పై ప్రేమ చూపించే ప్రేమ తనకున్న ఉదార స్వభావాన్ని తెలియజేస్తుంది.
Read Also : Rashmi Gautam : యాంకర్ రష్మి గౌతమ్ ఒక్కో షోకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!

