Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి గురించి అందరికీ తెలిసిందే. ఈయన గతంలో సమంత నాగచైతన్య విషయంలో చేసిన వ్యాఖ్యలు నిజం కావడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.అప్పటి నుంచి ఈయన సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోహీరోయిన్ల జాతకాలు చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ఉగాది పండుగ సందర్భంగా కొత్త ఏడాది ప్రారంభం కావడంతో ఈ ఏడాది పలువురు సినీ ప్రముఖుల జాతకాలు ఎలా ఉంటాయి అనే విషయం గురించి వేణుస్వామి తెలియజేశారు.
ఇక అల్లు అర్జున్ తో పాటు ఎన్టీఆర్, రానా, మహేష్ బాబు వంటి వారు కూడా ఇండస్ట్రీలో మంచిగా విజయాలను అందుకుంటారని వేణుస్వామి తెలిపారు. ఇకపోతే ఇండస్ట్రీలో రష్మిక, సమంత, పూజా హెగ్డే ఈ ముగ్గురు హీరోయిన్లకు 2024 వ సంవత్సరం వరకు ఇండస్ట్రీలో తిరుగులేదని వేణుస్వామి హీరో హీరోయిన్ల జాతకాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం వేణు స్వామి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.