Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ పేరును టాటూగా వేయించుకున్న నటి నమ్రత… ఫోటో వైరల్!

Puneeth Rajkumar: దివంగత కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ రాజ్ కుమార్ మంచితనం గురించి ఆయన మరణించిన తర్వాత యావత్ ప్రపంచానికి తెలిసింది. అంతటి గొప్ప మనసున్న పునీత్ రాజ్ కుమార్ ఎంతో మందికి సాయం చేసినా కూడా ఏనాడు పబ్లిసిటీ గురించి ఆశ పడలేదు. కన్నడ పరిశ్రమలో పునీత్ రాజ్ కుమార్ కోసం ప్రాణాలను ఇచ్చే అభిమానులు కూడా ఎంతో మంది ఉన్నారు. సామాన్య ప్రజలే కాకుండా ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఆయనకి పెద్ద ఫ్యాన్స్.

అంతటి గొప్ప వ్యక్తి అకస్మాత్తుగా కన్నుమూయడంతో కన్నడ అభిమానులతో పాటు అన్ని భాషల అభిమానులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అన్ని భాషలకు చెందిన సినీ ప్రముఖులందరూ కూడా ఆయనకు నివాళులు అర్పించారు. పునీత్ రాజ్ కుమార్ మరణించి ఆరు నెలలు కావస్తున్నా కూడా ఇప్పటికీ తమ అభిమాన హీరో లేరన్న విషయాన్ని కన్నడ అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. సామాన్య ప్రజలతో పాటు ఎంతో మంది సెలబ్రిటీలు కూడా ఆయనకు అభిమానులుగా మారారు.

Advertisement

 

అందుకు నిదర్శనంగా పునీత్ రాజ్ కుమార్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు ఒక నటి ఏకంగా ఆయన పేరును టాటూ వేయించుకుంది. నాగిని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన కన్నడ నటి నమ్రతా గౌడ పునీత్ రాజ్ కుమార్ గారికి పెద్ద ఫ్యాన్. పునీత్ రాజ్ కుమార్ మరణించినా కూడా ఆయన గుర్తుగా నమ్రత ఆయన పేరును టాటూగా వేయించుకుంది. పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా నమ్రత ఆయన పేరును టాటూ వేయించుకుంది. ఇటీవల నమ్రత టాటూ వేయించుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ” ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు” అంటూ క్యాప్షన్ పెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

Advertisement
Exit mobile version