Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Horoscope : ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లకు అస్సలే బాగాలేదు.. జాగ్రత్త సుమీ!

Horoscope : ఈ వారం అంటే జులై 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రాహాల వల్ల 12 రాశుల వారికే కల్గే ఫలితాలను గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వివరించారు. ముఖ్యంగా ఈ వారం ఈ రెండు రాశుల వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మకర రాశి.. మకర రాశి వాళ్లు శ్రద్ధగా పనిచేయండి, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మీ ప్రమేయం లేకపోయినా విమర్శించే వారుంటారు. నిదానంగా కార్యసిద్ధి లభిస్తుంది. పనులు వాయిదా వేయకుండా పూర్తిచేయాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఆవేశపరిచే సన్నివేశాలుంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. ఇంట్లోవారి సూచనలు అవసరం. నవగ్రహస్తోత్రం చదవండి, శుభం జరుగుతుంది.

Advertisement

ధనస్సు రాశి.. ధనస్సు రాశి వారికి కాలం అనుకూలంగా లేదు. సన్నిహితులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. యథాలాపంగా ఏ పనీ చేయవద్దు. తెలయని ఆటంకాలుంటాయి. గతానుభవాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించాలి. చెడు ఆలోచించవద్దు. ఈర్ష్యపడేవారు ఉంటారు. సున్నితంగా స్పందించాలి. ఆర్థిక విషయాల్లో తొందర పనికిరాదు. ఇష్టదేవతాధ్యానం మేలుచేస్తుంది.

Read Also : Horoscope: ఈవారం ఈ రెండు రాశుల వాళ్లకి పట్టిందల్లా బంగారమే..!

Advertisement
Exit mobile version