Site icon Latest Telugu News | తెలుగు వార్తలు – Tufan9.com

Astro Tips for Tulasi : అనుకున్న పనులలో విజయం సాధించాలంటే తులసి పూజలో ఈ నియమాలు తప్పనిసరి!

Astro Tips for Tulasi : హిందూ శాస్త్రం ప్రకారం తులసి మొక్కను ఎంతో పవిత్రమైన మొక్కగా భావిస్తారు. తులసి మొక్కను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించడం వల్ల ప్రతి ఒక్క ఇంటి ఆవరణంలోనూ మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది. తులసి మొక్క కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే తులసి మొక్కను పూజించాలి అంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి.ఈ విధంగా శాస్త్రం ప్రకారం తులసి మొక్క పూజ విషయంలో కొన్ని నియమాలు పాటించడం వల్ల మనం అనుకున్న పనులలో విజయం తప్పనిసరిగా వరిస్తుంది. మరి నియమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

These rules are mandatory in Tulasi Puja to get success

వాస్తు శాస్త్ర ప్రకారం తులసి మొక్కను ఇంటికి ఈశాన్య దిశలో నాటడం ఎంతో శుభప్రదం. ఈ దిశలో తులసి మొక్క ఉండటం వల్ల ఇంట్లో సుఖసంపదలు వెళ్ళు విరుస్తాయి. ఎప్పుడూ కూడా తులసి మొక్కను దక్షిణ దిశ వైపు నాటకూడదు. దక్షిణ దిశ పూర్వికుల స్థానం కనుక తులసి మొక్కను ఈ స్థానంలో ఎప్పుడు నాటి పూజ చేయకూడదు.ఈ విధంగా దక్షిణ దిశలో తులసి మొక్కను నాటడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే తులసి చెట్టు దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. పొరపాటున కూడా చెత్తాచెదారం చెప్పులు వదలడం వంటివి చేయకూడదు.

తులసి మొక్కకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయడం ఎంతో శుభప్రదం అయితే సాయంత్రం పూట తులసి మొక్కను తాకరాదు. స్వచ్ఛమైన నేతి దీపారాధన చేయడం వల్ల అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి. ప్రతిరోజు తులసి మొక్కకు పూజ చేసిన అనంతరం ఓం సుభద్ర ఆయే నమః, ఓం సుప్రభాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఏడు ప్రదక్షిణాలు చేయాలి.ఇక తులసి మొక్కకు నీటిని కాకుండా పచ్చిపాలను నైవేద్యంగా పెట్టడం వల్ల మనకు ఉన్న దరిద్రం తొలగిపోయి మనం చేసే పనులలో విజయాన్ని కలిగిస్తుంది.ఇలా తులసి మొక్కకు పూజ చేసే సమయంలో ఈ నియమాలను పాటించడం వల్ల జీవితంలో అనుకున్న పనులు ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయి.

Advertisement

Read Also :  Tulasi plant: తులసి మొక్క విశిష్ట లక్షణాలు… మీకోసం !

Exit mobile version